Gold Price Today: వరలక్ష్మీ వ్రతం వేళ బంగారం దూకుడు.. మరో ఆల్ టైమ్ రికార్డ్ ! ఎంత పెరిగిందో తెలుసా?

Published : Aug 08, 2025, 11:47 AM IST

Gold Price Today: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాల వేళ బంగారం ధరలు మరో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. వరుసగా ఐదో రోజూ బంగారం ధరలు పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹760 పెరిగి ₹1,03,310కు చేరింది. 

PREV
16
పసిడి పరుగులు

Gold Price Today: భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేక స్థానముంది. మహాలక్ష్మి దేవిని ప్రతీకగా భావించారు. బంగారం కొనడం అంటే తమ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు. అయితే.. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఉత్సవాల వేల బంగారం కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతాయి. 2025 ఆగస్టు 8న బంగారం ధరలు ఎంత పెరిగిందో తెలుసా?

26
వరలక్ష్మీ వ్రతం రోజున బంగారం ధరలు

హైదరాబాద్, తెలంగాణలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 760 పెరిగి రూ 1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 700 పెరిగి రూ. 94,700 పలుకుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం రూ.76,910 నుంచి రూ.76,920కు పెరిగింది.

36
వెండి ధరల్లో సంచలన పెరుగుదల

వెండి ధరలు కూడా ఈ వేళ పెరుగుదల కనిపిస్తోంది. చేరుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,27,000 నుంచి రూ.1,27,100కి పెరిగింది. తులం వెండి ధర రూ.1,271 స్థాయిలో ఉంది. ఈ పెరుగుదల గత నాలుగు రోజుల్లో సుమారు రూ.4,100గా నమోదు అయ్యింది. ఇది వెండి మార్కెట్‌లో భారీ మదుపు, డిమాండ్ పెరుగుదలకి సంకేతం.

46
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలు
  • దేశీయ మార్కెట్: ఎంసీఎక్స్ (మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్) లో 10 గ్రాముల బంగారం ధర రూ.651 లాభంతో రూ.1,02,119కి చేరింది. 
  • వెండి ధర రూ.596 లాభంతో రూ.1,14,882కి చేరింది.
  • అంతర్జాతీయ మార్కెట్: గ్లోబల్ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర $3,396 వద్ద ట్రేడవుతోంది. చాలా తక్కువ సమయంలోనే అత్యధిక స్థాయికి చేరుకుందని చెప్పాలి. 
56
బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణాలు

అమెరికా సుంకాల ప్రభావం: ట్రంప్‌ యాజమాన్యం భారత్‌పై 25% అదనపు దిగుమతి సుంకాలు విధించడం వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీసింది.

రూపాయి బలహీనత: డాలర్ బలపడటం, రూపాయి తగ్గడం కూడా దిగుమతి విలువ పెరగటానికి కారణమతుంది. 

సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ కొనుగోళ్లు: కొన్ని కేంద్ర బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వులను పెంచుతున్నాయి.  

ఫెస్టివల్ సీజన్: శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతం వంటి ఉత్సవాలు, వివాహాలు మొదలైనవి కూడా  బంగారం ధరలు పెరగడానికి కారణం.  

పెట్టుబడి వాతావరణం: ఆర్థిక అస్థిరతలలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి వైపు ఆకర్షితులవుతున్నారు.

66
భవిష్యత్ అంచనాలు

బంగారం ధరలు భవిష్యత్తులో అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు, ఆర్థిక విధానాలు, ద్రవ్యోల్బణం స్థాయి వంటి అంశాలపై ఆధారపడి మారతాయి. పెట్టుబడిదారులు అత్యధిక రిస్క్ తీసుకోకుండా కొద్దికొద్దిగా, దశలవారీగా బంగారం కొనడం మంచిదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories