Actor: పోలీస్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చిన నటుడు.. ఒకప్పుడు ఇండస్ట్రీనే శాసించాడు.. ఎవరో తెలుసా.?

Published : Oct 09, 2025, 10:35 AM IST

Actor: కెరీర్ స్టార్టింగ్‌లో ప్రతీ యాక్టర్ కూడా ఏదొక రంగంలో ఉద్యోగం సంపాదించినవారే. అయితే ఆ ఉద్యోగాన్ని కాదని.. తమకు ఎంతగానో ఇష్టమైన యాక్టింగ్‌ వైపు మళ్లుతారు కొందరు. అలా వచ్చి.. హీరోగా మారారు ఈ బుడ్డోడు. మరి అతడెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

PREV
15
ఆయనో బాలీవుడ్ ఐకాన్

మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్‌కుమార్ పేరును ఇప్పటికీ హిందీ పరిశ్రమ గుర్తుపెట్టుకుంటుంది. ఆయనపై గౌరవం, అభిమానం అలాగే ఉంటుంది. శక్తివంతమైన స్వరం. అద్భుతమైన నటన.. నిజాయితీ, నిర్భయ.. ఇవి రాజ్‌కుమార్ సొంతం. ఒకప్పుడు పోలీస్‌గా తన కెరీర్ ప్రారంభించిన ఈయన.. ఆపై యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

25
బలూచిస్తాన్‌లో జననం.. ముంబైలో పోలీస్ జాబ్

1926, అక్టోబర్ 8న బలూచిస్తాన్‌లోని లోరలైలో కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు రాజ్‌కుమార్. ఆయన అసలు పేరు కులభూషణ్ పండిట్‌. అప్పుడు బలూచిస్తాన్ నుంచి ఆయన కుటుంబం ముంబై రాగా.. అక్కడ రాజ్ కుమార్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ సినిమాల్లో నటించాలనే కోరికతో ఉండేవారు.

35
అలా మొదటి అవకాశం..

ఒక రోజు నిర్మాత బల్దేవ్ దూబే ఆయన పోలీస్ స్టేషన్‌ను రాగా.. అక్కడ రాజ్‌కుమార్ డైలాగ్ డెలివరీ, అందానికి ఆకర్షితుడయ్యారు. అలా రాజ్ కుమార్‌కు 'షాహి బజార్' అనే సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. దీంతో ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా తన పోలీసు ఉద్యోగాన్ని వదులుకుని సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు రాజ్ కుమార్. రాజ్ కుమార్‌కు సినీ జీవితం మొదట్లో అంత సులభంగా సాగలేదు.

45
కెరీర్ మొదట్లో కష్టాలు..

కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న పాత్రలు పోషించిన రాజ్ కుమార్.. హీరోగా రంగీలి(1952వ సంవత్సరం) సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా ఆయనకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన మదర్ ఇండియా(1957) రాజ్ కుమార్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చిపడింది. ఆపై ఆయన 'హీర్ రాంఝా', 'తిరంగ', 'మార్టే దమ్ తక్', 'సౌదాగర్', 'పాకీజా' వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకోవడమే కాదు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.

55
గొంతు క్యాన్సర్‌తో తుది శ్వాస

ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజన్స్ అందరినీ మంత్రముగ్దులను చేసేది. తన పాత్రకు సరిగ్గా సరిపోయే డైలాగులు లేకపోతే.. ఎలాంటి సంకోచం లేకుండా రాజ్ కుమార్.. సెట్స్‌లోనే డైరెక్టర్‌కు చెప్పి మార్చేవారట. ఏ పాత్ర పోషించినా.. అది ది బెస్ట్‌గా ఉండాలని తాపత్రయపడేవారట రాజ్ కుమార్. ఎన్నో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కించుకున్న రాజ్ కుమార్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్‌గా నిలిచిపోయారు. ఇక గొంతు క్యాన్సర్ కారణంగా రాజ్ కుమార్ 1996, జూలై 3న 69 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు.

Read more Photos on
click me!

Recommended Stories