వర్షాకాలంలో ఏయే కూరగాయలను తినకూడదో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 6, 2024, 2:25 PM IST

వర్షాకాలంలో మనం లేని పోని వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. తేమతో కూడిన వాతావరణం, ఆయిలీ ఫుడ్, చెడు ఆహారాలతో పాటుగా కొన్ని రకాల కూరగాయల వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వానాకాలంలో ఎలాంటి కూరగాయలన తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


వానాకాలంలో వర్షాలు పడుతూనే ఉంటాయి. దీనివల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. తేమగా కూడా ఉంటుంది. కానీ దీనివల్ల మనకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇతర కాలాలతో పోలిస్తే వానాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సీజన్ లో కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. అవేంటి? వాటిని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆకు కూరలు: ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో రకరకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. కానీ వానాకాలంలో ఆకు కూరలను పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే వర్షం పచ్చని ఆకు కూరలను కలుషితం చేస్తుంది. అలాగే ఈ సీజన్ లో ఆకు కూరలు తెగుళ్ల బారిన పడతాయి. వీటికి ఎన్నో రకాల పురుగులు, కీటకాలు అంటుకుని ఉంటాయి. అందులోనూ తేమ వల్ల ఆకులు తొందరగా కుళ్లిపోతాయి. అందుకే ఈ సీజన్ లో ఆకు కూరలను అస్సలు తినకూడదు. 

Latest Videos

వంకాయ: వంకాయలో కూడా మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ వంకాయలను వర్షాకాలంలో తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వంకాయలో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి వర్షాకాలంలో బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించే రసాయనాన్ని విడుదల చేస్తాయి. అందుకే ఈ సీజన్ లో వీటిని తినకూడదని చెప్తారు. 

బెల్ పెప్పర్: వానాకాలంలో బెల్ పెప్పర్ లకు దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో గ్లూకోసినోలేట్స్ అనే రసాయనం ఉంటుంది. ఇది పెరిగిన తేమ వల్ల మనకు వికారం, వాంతులను కలిగిస్తుంది. 

కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ వర్షాకాలంలో వంకాయలతో పాటుగా క్యాలలీఫ్లవర్ కూరగాయను కూడా తినకూడదు. ఎందుకంటే కొంతమందికి గ్లూకోసినోలేట్‌లకు అలెర్జీ ఉంటుంది.  ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

క్యాబేజీ:  క్యాబేజీ ఒక హెల్తీ కూరగాయ. కానీ వానాకాలంలో క్యాబేజీని తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే క్యాబేజీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల క్యాబేజీలో బ్యాక్టీరియా, జెర్మ్స్‌ బాగా పెరుగుతాయి. అందుకే ఈ సీజన్ లో క్యాబేజీని తినకూడదని చెప్తారు. 

click me!