ఎన్నో పోషకాలున్న గొప్ప పండు అంజీర్. దీన్ని అలాగే లేదా ఎండబెట్టి తింటుంటారు. నిజానికి ఈ పండులో మనల్ని హెల్తీగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ పండ్లను ఏ సమయంలో తింటే మంచిది? అన్న సంగతి ఎవ్వరికీ తెలియదు.
అంజీర్ లేదా అత్తి పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఒక తీయని, హెల్తీ పండు. దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే ఈ పండ్లను కొంతమంది ఉదయం తింటే, మరికొంతమంది సాయంత్రం వేళ తింటుంటారు. ఇంకొందరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తింటుంటారు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే మాత్రం ఈ పండును ఒక నిర్ధిష్ట సమయంలోనే తినాలని నిపుణులు చెబుతున్నారు.
అంజీర్ ను ఎప్పుడు తినాలి?
ఉదయం అంజీర్ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఉదయాన్నే అంజీర్ పండును తింటే మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దీనిలో ఉండే నేచురల్ షుగర్స్ మీ శక్థిస్థాయిలను పెంచుతాయి. అలాగే ఉదయాన్నే అత్తి పండ్లను తింటే మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో మలబద్దకం, అజీర్థి వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. అంజీర పండ్లు మన ఆకలిని నియంత్రించడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఈ పండును ఉదయాన్నే తింటే మీరు హెవీగా తినలేరు. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది.
సాయంత్రం అంజీర్ ను తినడం వల్ల కలిగే బెనిఫిట్స్
ఉదయమే కాదు సాయంత్రం పూట తినడం వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ పండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను సడలించి మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. దీంతో మీరు హాయిగా నిద్రపోతారు. సాయంత్రం పూట అంజీర్ ను తింటే ఇవి తినాలి, అవి తినాలి అనే ఫుడ్ కోరికలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అంటే ఈ పండును తింటే మీరు చిరుతిండిని తినలేరు. దీనివల్ల మీరు బరువు పెరిగే సమస్య ఉండనే ఉండదు.
అంజీర్ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్ లు ఫైబర్ కు మంచి వనరులు. ఇవి మన కడుపును తొందరగా నింపుతాయి. అలాగే జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ పండ్లను తింటే మలబద్దకం తగ్గిపోతుంది. అంజీర్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె లు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం.
అత్తిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీర మంటను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఈ పండ్లను రెగ్యులర్ గా తింటే రక్త పోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంజీర్ లో ఉండే కాల్షియం, ఫాస్పరస్ లు ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి.
ఇకపోతే అంజీర్ ను ఉదయం తినాలా? సాయంత్రం తినాలా? అనేది వ్యక్తిగత ప్రాధాన్యత, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ పండ్లను ఉదయం తింటే ఎనర్జిటిక్ గా, సాయంత్రం తింటే రిలాక్స్ గా ఉంటారు. కాబట్టి ఎప్పుడు తినాలనేది మీ డిసిషన్ పై ఆధారపడి ఉంటుంది.