మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. కానీ చాలా మంది అకలి దంచేస్తుందని మధ్యాహ్నం పూట ఏవో ఒకటి తిని కడుపు నింపుకుంటారు. కానీ దీనివల్ల మీ ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది.
మనం తినే ఫుడ్స్ పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ చాలా మంది ఆకలి అవుతుందనో లేదా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లామనో.. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను రోజూ తింటుంటారు. కానీ ఈ ఆహారాలు మీ ఆరోగ్యాన్ని క్రమంగా ప్రమాదంలో పడేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి.
కానీ మనలో చాలా మంది మధ్యాహ్నం పూట ఏవి అందుబాటులో ఉంటే వాటినే తింటుంటారు. అసలు ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయా? లేక రిస్క్ లో పడేస్తాయా? అని కూడా ఆలోచించకుండా తింటుంటారు. కానీ ఇలా తినడం వల్ల మీ శరీరం లోపలి నుండి దెబ్బతినడం ప్రారంభమవుతుంది. అందుకే మంచి ఆరోగ్యం కోసం మధ్యాహ్నం పూట తినకూడని కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వేయించిన ఆహారాలు: చాలా మంది ఆఫీసుకు లేదా వారి రోజువారి పనులకు లంచ్ బాక్స్ ను తీసుకెళ్లనప్పుడు బయటి ఫుడ్ నే తింటుంటారు. ముఖ్యంగా వేయించిన ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. కానీ ఇది హెల్త్ కు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ జీర్ణ ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వేయించిన ఆహారాలకు బదులుగా ఇంట్లో వండిని ఆహారాన్ని మాత్రమే తినండి. ఒకవేళ మీరు లంచ్ బాక్స్ ను తీసుకెళ్లకపోతే పండ్లు లేదా ఏదైనా హెల్తీ ఫుడ్ ను తినండి.
రాత్రి మిగిలింది: మధ్యాహ్నం భోజనంలో ఫ్రెష్ గా వండిన ఆహారాన్ని మాత్రమే తినండి. అయితే చాలా మంది రాత్రి మిగిలిన వాటిని కూడా మధ్యాహ్నం పూట తింటుంటారు. కానీ ఇలా మిగిలిపోయిన ఆహారాలను మధ్యాహ్నం పూట తినకూడదు. ఎందుకంటే వీటిని తింటే కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
సూప్ లేదా సలాడ్: కొంతమంది లంచ్ లో సూప్ లేదా సలాడ్ ను మాత్రమే తింటుంటారు. ఇవి ఆరోగ్యకరమైనవే అయినా వీటిని మధ్యాహ్నం పూట మాత్రం తినకూడదు. మధ్యాహ్న భోజనంలో ఎప్పుడూ కూడా సమతుల్య ఆహారాన్నే తినాలి. సూప్ లేదా సలాడ్ ను తీసుకోవడం, సాయంత్రం కొన్ని అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
పండ్లు: పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ మీరు ప్రతిరోజూ మధ్యాహ్నం పూట కేవలం పండ్లను మాత్రమే తినడం మంచిది కాదు. కావాలనుకుంటే మీరు పండ్లను భోజనానికి ముందు లేదా ఆ తర్వాత తినొచ్చు. మధ్యాహ్న భోజనంలో మీరు పండ్లను మాత్రమే తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
శాండ్విచ్లు లేదా ప్యాకేజీ చేసిన ఆహారాలు: లంచ్ గా శాండ్ విచ్ లు లేదా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ను అస్సలు తినకూడదు. ఇవి టేస్టీగానే ఉన్నా మీ ఆరోగ్యం మాత్రం పక్కాగా దెబ్బతింటుంది. అలాగే మధ్యాహ్న భోజనంలో మీరు పిజ్జా లేదా పాస్తాను కూడా తినకూడదు. ఎందుకంటే దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మీరు బరువు కూడా పెరుగుతారు.