మొలకలు వచ్చిన ఆలుగడ్డలు తినొచ్చా...?

By ramya Sridhar  |  First Published Jul 8, 2024, 1:57 PM IST

మొలకలు వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోకుండా చాలా మంది తినేస్తూ ఉంటారు. కానీ.. మొలకెత్తిన బంగాళదుంపలను తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం...


కూరగాయలు కొనడానికి వెళ్లిన ప్రతిసారీ కచ్చితంగా ప్రతి ఒక్కరూ కొనే కూరగాయ ఏదైనా ఉంది అంటే.. అది  ఆలుగడ్డ. అదేనండి బంగాళదుంప. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ... వీటిని ఇష్టంగా తింటారు. ఈ కూరగాయకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే... అన్ని కూరగాయల్లగా.. ఇవి తొందరగా పాడవ్వవు.  అందుకే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు.అయితే... ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల వాటికి మొలకలు వస్తూ ఉంటాయి.  మొలకలు వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోకుండా చాలా మంది తినేస్తూ ఉంటారు. కానీ.. మొలకెత్తిన బంగాళదుంపలను తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం...

బంగాళదుంపలో సోలనిస్, చాకోనిస్ ఉంటాయి. ఇవి తక్కవ పరిమాణంలో తీసుకున్నప్పుడు కొలిస్ట్రాల్, రక్తంలో చెక్కర స్థాయిలను నిర్వహించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ... మొలకెత్తిన బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Latest Videos

మొలకెత్తిన బంగాళదుంపల్లో ట్యాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే.. మొలకెత్తిన వాటాిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.  మొలకెత్తిన బంగాళ దుంపల్లో  గ్లైకోఅల్కలాయిడ్స్ ఉంటాయి. కాబట్టి.. వీటిని తినడం వల్ల... జీర్ణాశయ, నరాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. కడుపులో వికారం, వాంతులు, అతిసారం, తలనొప్పి వంటి లక్షణాలు కనపడతాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.

గ్లైకోఅల్కలాయిడ్స్ స్థాయిలు పెరగడం వల్ల బంగాళాదుంపలు చేదు రుచిని అందిస్తాయి, వాటిని తినడం రుచించదు. అంతేకాకుండా... మొలకెత్తే ప్రక్రియ బంగాళాదుంపలలో పోషకాలు తగ్గిపోతాయి.పోషకాలు లేకుండా.. తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. లేదు.. పారేయకుండా వాటిని తినాలి అనుకుంటే... ఆ మొలకలు మొత్తం తీసేసి... బంగాళదుంపలను పీల్ చేసి.. తర్వాత వండుకొని మీరు తినొచ్చు.

click me!