Latest Videos

ఖర్బూజా గింజలు పనికిరావని అనుకోకండి.. వీటిని తింటే ఏమౌతుందో తెలుసా?

By Shivaleela RajamoniFirst Published Jul 3, 2024, 10:46 AM IST
Highlights

ఖర్బూజా మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. ఈ ఫ్రూట్ లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. సాధారణంగా ఖర్బూజాను తినేసి వాటి గింజలను పారేస్తుంటారు. కానీ వీటిని కూడా ఎంచక్కా తినొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 
 

ఖర్బూజా పండ్ల రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందులోనూ ఈ పండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే చాలా మంది ఈ పండు గుజ్జును మాత్రమే తినేసి.. గింజలను పారేస్తుంటారు. కానీ ఈ గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి తెలుసా? ఖర్బూజా గింజల్లో ప్రోటీన్, పొటాషియం, జింక్, మాంగనీస్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. మరి ఈ గింజలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రోగనిరోధక శక్తి: మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే మనం వివిధ రోగాలకు దూరంగా ఉంటాం. ఖర్బూజా గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతుంది. కాబట్టి ఖర్బూజా గింజలను తింటే మీ రోగనిరోధక శక్తి పెరిగి మీరు ఎన్నో సీజనల్, వైరల్ వ్యాధులకు దూరంగా ఉండగలుగుతారు. 

తక్కువ రక్తపోటు: ఖర్బూజా గింజల్లో పొటాషియం మంచి మొత్తంలో ఉంటుంది. ఖర్బూజా గింజలను తింటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే హైబీపీతో బాధపడేవారు ఖర్బూజాను తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. 

కళ్ల ఆరోగ్యం: ప్రస్తుత కాలంలో చాలా మంది కంటి సమస్యలో బాధపడుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖర్బూజా గింజలు మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఖర్బూజా గింజల్లో విటమిన్ -ఎ, బీటా కెరోటిన్ వంటి కళ్లను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

ఎసిడిటీని తగ్గిస్తుంది:  ఖర్బూజా గింజల్లో ఉండే పోషకాలు కడుపు సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఒత్తిడిని తగ్గిస్తుంది: ఖర్బూజ గింజలను రోజూ తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఖర్బూజా గింజలను రెగ్యులర్ గా కొద్ది మొత్తంలో తింటే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

గోర్లు, జుట్టు ఆరోగ్యం:  ఖర్బూజా గింజలు గోర్లు, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ గింజల్లో ఉండే ప్రోటీన్లు మన గోళ్లు, జుట్టు బాగా పెరగడానికి సహాయపడతాయి. ఈ గింజలను తింటే మన గోర్లు, జుట్టు హెల్తీగా ఉంటాయి. ఖర్బూజ గింజలు గర్భిణులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

ఎలా తినాలి: ఖర్బూజా గింజలను వివిధ మార్గాల్లో తినొచ్చు. వీటిని  వేయించి స్నాక్స్ గా తినొచ్చు. అలాగే పొడి చేసి తినొచ్చు. లేదా సలాడ్లలో టాప్ చేసి, స్మూతీలలో లేదా సూప్ లో తీసుకోవచ్చు. 

click me!