Latest Videos

ఉడకపెట్టిన స్వీట్ పొటాటో రోజూ తింటే ఏమౌతుంది..?

By ramya SridharFirst Published Jul 2, 2024, 10:43 AM IST
Highlights

ఉడకపెట్టినప్పుడు చిలగడ దుంప గ్లెసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది బ్లడ్ షుగర్ పై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

మనకు మార్కెట్లో చాలా రకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. వాటిలో స్వీట్ పొటాటో కూడా ఒకటి. ఈ వర్షాకాలం లో ఈ స్వీట్ పొటాటో(చిలగడ దుంప) చాలా విరివిగా దొరుకుతాయి. ఇవి రుచి విషయంలో చాలా అద్భుతంగా ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. మరి... ఈ స్వీట్ పొటాటోని రోజూ తినొచ్చా..? అసలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

ఉడికించిన చిలగడ దుంప నిజానికి ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే... మనం చిలగడదుంపలు ఎంత ఉడకపెడితే అంత ఆరోగ్యకరంగా మారుతూ ఉంటుందట. ఎందుకంటే... ఉడకపెట్టినప్పుడు చిలగడ దుంప గ్లెసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది బ్లడ్ షుగర్ పై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

 మీరు చిలగడదుంపలను ఎంత ఎక్కువ కాలం ఉడకబెట్టారో, అవి ఆరోగ్యంగా మారుతాయి. ఉదాహరణకు, మీరు చిలగడదుంపలను కేవలం ఎనిమిది నుండి 10 నిమిషాలు ఉడకబెట్టినట్లయితే, వాటి గ్లైసెమిక్ సూచిక 59 నుండి 61 వరకు ఉంటుంది. మీరు చిలగడదుంపలను 30 నిమిషాలు ఉడకబెట్టినట్లయితే, అవి 45 నుండి 46 వరకు తక్కువగా ఉంటాయి. కాబట్టి.. మీరు రోజూ ఎలాంటి భయం లేకుండా... చిలగడ దుంపలను తినవచ్చు

ఎక్కువగా.. చిలగడదుంపలను.. కేవలం ఉడకపెట్టి తింటూ ఉంటారు. కానీ.. వీటితో చాలా రకాల రెసిపీలు చేసుకోవచ్చు.  స్వీట్ పొటాటోతో టిక్కీ చేసుకోవచ్చు. సూప్ చేసుకోవచ్చు.  షుగర్ కాకుండా.. బెల్లం వాడి హెల్దీగా.. స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఎలా తిన్నా.. ఇది పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యకరమే. 

click me!