కందిపప్పుతో చేసిన చారు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే వారానికి ఒకసారైనా కందిపప్పును వండుతారు. అయితే ఈ కందిపప్పును తింటే ఏమౌతుందో తెలుసా?
మనం ఇంట్లో ఎన్నో రకాల పప్పుధాన్యాలతో వంట చేస్తుంటాం. వీటిలో కందిపప్పు ఒకటి. చాలా మంది కందిపప్పును ఇష్టంగా తింటుంటారు. నిజానికి కందిపప్పులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మనకు మంచి బలాన్ని ఇస్తాయి. అసలు కందిపప్పును తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పోషకాలు: కందిపప్పులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి.
undefined
బీపీ నియంత్రణ: కందిపప్పులో ఇతర పోషకాలతో పాటుగా పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. కందిపప్పులో ఉండే ఈ ఖనిజం రక్తపోటును స్థిరీకరించే మూలకంగా పని చేసి మనల్ని కాపాడుతుంది.
బరువు తగ్గడానికి: బరువు తగ్గడానికి కొన్ని రకాల పప్పులు కూడా సహాయపడతాయి. వాటిలో కందిపప్పు కూడా ఉంది. అవును మీరు బరువు తగ్గాలనుకుంటున్నట్టైతే మీ ఆహారంలో కందిపప్పును చేర్చండి. కందిపప్పు మీ ఆకలిని తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుండెకు మంచిది: కందిపప్పు గుండె జబ్బుల రిస్క్ ను తగ్గించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పప్పును మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కందిపప్పును తింటే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
బ్లడ్ షుగర్ : డయాబెటీస్ పేషెంట్లకు కూడా కందిపప్పు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును ఈ పప్పును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తగ్గుతుంది. నిజానికి ఈ పప్పు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది.
శరీరంలో శక్తి: కందిపప్పును తింటే మనం ఎనర్జిటిక్ గా ఉంటాం. ఈ పప్పులో ఉండే పోషకాలు మన శరీరానికి మంచి శక్తిని అందించడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఈ పప్పు మన శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
మలబద్ధకం ఉపశమనం: మలబద్దకంతో బాధపడుతున్నవారికి కూడా కందిపప్పు మంచి ప్రయోజకరంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్టైతే కందిపప్పును తరచుగా తింటుండండి. ఈ పప్పును తింటే అజీర్ణం, మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది.