రోజూ ఒక ఆపిల్ ను తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న మాటను వినే ఉంటారు. అలా అని మీరు అతిగా తినేరు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే లేనిపోని వ్యాధులు చుట్టుకుంటాయి మరి.
ఆపిల్ పండ్లను తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు మనకు ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అందుకే వీటిని రోజూ తినాలని డాక్టర్లు, ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఆపిల్ పండును తింటే డాక్టర్ కు దూరంగా ఉంటారు అన్న ఒక సామేత కూడా ఉంది. ఈ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు వివిద రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. ఆపిల్ పండ్లలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నా వీటిని లిమిట్ లోనే తినాలి. లేదని ఎక్కువగా తిన్నారంటే సమస్యల్లో పడతారు.
ఆపిల్స్ హెల్తీ ఫుడ్ అయినా.. వీటిని అతిగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పండులో సహజ చక్కెర, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను పరిగడుపున తినడం వల్ల మంచి మేలు జరుగుతుంది. కానీరోజుకు 2 కంటే ఎక్కువ ఆపిల్స్ ను తింటే మాత్రం మీ హెల్త్ రిస్క్ లో పడిపోతుంది. అసలు ఆపిల్స్ ను ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం రోజుకు 1-2 ఆపిల్స్ తినాలి. ఇంతకు మించి ఎక్కువ ఆపిల్స్ ను తింటే జీర్ణక్రియ సమస్యతో పాటు వేరే సమస్యలు కూడా వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆపిల్స్ ను ఎక్కువగా తింటే కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. యాపిల్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే కడుపు తిమ్మిరి, నొప్పి సమస్యలు కూడా వస్తాయి.
ఆపిల్స్ లో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అంలే ఇది డయాబెటీస్, జీవక్రియ ఆరోగ్యం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాెబటీస్ పేషెంట్లు ఆపిల్స్ ను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అలాగే ఇన్సులిన్ సున్నితత్వానికి దారితీస్తుంది. అలాగే ఆపిల్ పండ్లను ఎక్కవుగా తింటే దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. నిజానికి ఆపిల్ పండ్లలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. వీటిని అతిగా తింటే జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. ఇది శరీరంలో కొవ్వు పెరగడానికి దారితీస్తుంది.
ఆపిల్స్ ను ఎప్పుడు తినకూడదు?
ఆపిల్ పండ్లను ఎప్పుడూ కూడా సాయంత్రం, నిద్రపోయే ముందు తినకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ఆపిల్స్ ను తింటే గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. మీకు ఇప్పటికే ఈ సమస్యలు ఉంటే రాత్రిపూట ఆపిల్స్ ను తినడం మానుకోండి.
ఆపిల్స్ ను ఎప్పుడు తినాలి?
ఆపిల్ ను ఉదయాన్నే పరగడుపున ఆపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే ఆపిల్ ను తింటే రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే ఆకలి ఎక్కువగా ఉండదు. దీంతో మీరు ఫుడ్ ను అతిగా తినరు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు ఉదయాన్నే ఆపిల్ ను తింటే ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు.
ఆపిల్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఆపిల్స్ లో ఉండే ఫైటర్, పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ పండులో ఉండడే ఐరన్ శరీరంలో రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఈ పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి.