వేడి నీటిలో నెయ్యి వేసుకొని తింటే ఏమౌతుంది..?

By ramya Sridhar  |  First Published Aug 21, 2024, 11:49 AM IST

నెయ్యిని ఆహారంలో భాగంగా కాకుండా.. వేడి నీటిలో నెయ్యి వేసుకొని ఎప్పుడైనా తీసుకున్నారా..? అలా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం...


నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యిని రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యంగా ఉండగలరు. నెయ్యి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.  వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అందరికీ తెలుసు.

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి  వాతా, పిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. నెయ్యిని ఆహారంలో భాగంగా కాకుండా.. వేడి నీటిలో నెయ్యి వేసుకొని ఎప్పుడైనా తీసుకున్నారా..? అలా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం...

Latest Videos

నెయ్యి తింటే బరువు పెరిగే అవకాశం ఉన్నా, తక్కువ తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. వేడి నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల మీ పొట్ట కొవ్వు కరిగిపోతుంది. ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

మలబద్ధకానికి వీడ్కోలు!

వేడి నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే జీవక్రియ మెరుగుపడుతుంది. మీ శక్తి పెరుగుతుంది. గుండె, మెదడు ఆరోగ్యం బాగుంటుంది. వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల పేగులు సజావుగా సాగుతాయి. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ పొట్టలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది.

బ్రెయిన్ టానిక్:

ఆయుర్వేదం ఆవు నెయ్యిని 'మేధ్య రసాయనం' అంటుంది. ఇది యువకుల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్యాన్ని , జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దాదాపు బ్రెయిన్ టానిక్ లాగా పనిచేస్తుంది. మెదడు , నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే నాడీ వ్యవస్థలో మంచి మార్పు వస్తుంది. ఇది ఆందోళనతో సహా మెదడును ప్రభావితం చేసే ఇతర రుగ్మతల నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.

విటమిన్లు..

ఆవు నెయ్యి తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ ,విటమిన్ కె వంటి కొవ్వులో కరిగే విటమిన్ల శోషణకు అవసరమైన మంచి కొవ్వులను నెయ్యి మన శరీరంలో ఉంచుతుంది. నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణమవుతుంది. మితంగా నెయ్యి తినడం గుండె ఆరోగ్యానికి మంచిది.

చర్మాన్ని రక్షిస్తుంది:

నెయ్యి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మానికి గ్లో ఇస్తుంది. నెయ్యిలో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయి. చర్మం పొడిబారకుండా పోవడానికి వేడినీళ్లలో నెయ్యి కలిపి తాగుతూ ఉండవచ్చు.

ఎలా తీసుకోవాలంటే.. 

ఈ డ్రింక్ ను ముందుగా ఉదయాన్నే తాగడం మంచిది. ఉదయం తాగితే ఎక్కువగా పని చేస్తుంది. ముందుగా 200 ml వేడి నీటిని తీసుకుని దానికి 1 చెంచా నెయ్యి లేదా వెన్న కలపండి. దీన్ని బాగా కలపండి. పరగడుపున తాగితే సరిపోతుంది. ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే..  ఇంకా ఆరోగ్యకరం.

click me!