థైరాయిడ్ తో బాధపడుతున్నారా..? ఈ ఫుడ్స్ తో చెక్..!

By telugu news team  |  First Published Oct 14, 2021, 2:00 PM IST

థైరాయిడ్ కారణంగా చాలా మంది అధిక బరువు పెరిగిపోతుంటారు. సంతాన సమస్యలు తలెత్తుతాయి. జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. ఈ సమస్యలన్నింటినీ భరించాల్సి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించే ఆహారా పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


థైరాయిడ్ (Thyroid) ఈ సమస్యతో బాధపడుతున్నవారు చాలా మందే ఉన్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ థైరాయిడ్ సమస్య అందరినీ వేదిస్తోంది.  ఈ వ్యాధితో ల‌క్ష‌ల మంది పోరాడుతున్నారు. జీవితాంతం ఈ సమస్యను అదుపులో ఉంచుకోడానికి, తగ్గించుకోడానికి ఎన్నో మందులు వాడుతుంటారు.ఈ హైపోథైరాయిడ్‌ని సరైన ఆహార పద్ధతుల ద్వారా కంట్రోల్‌ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహారాలేంటో ఓసారి చూసేద్దామా..

Latest Videos

థైరాయిడ్‌ గ్రంధి తన పని తాను సరిగ్గా చేయనప్పుడు అనగా తగినంత థైరాయిడ్‌ని తయారు చేయనప్పుడు ఈ హైపో థైరాయిడ్‌ అనే వ్యాధి వస్తుంది. థైరాయిడ్‌ గ్రంధి రెండు రకాల హార్మోన్స్‌ని తయారు చేస్తుంది. 1. థైరాక్సిన్‌ హార్మోన్‌ (టి 4 ), 2. ట్రైఐడో థైరోనిన్‌ (టి.3). ఈ రెండు హార్మోన్లు మనీ జీవక్రియను కంట్రోల్‌ చేస్తుంటాయి. అంటే మెటపాలిజంని నియంత్రిస్తుంటాయి.

శరీరం పనిచేసే వేగాన్ని నియంత్రిస్తుంటాయి. మనం ఖర్చు చేసేటటువంటి శక్తి నిలువలు, శరీరం లోపలి ఉష్ణత్వం, మన బరువు, గుండె పనితీరు, జీర్ణవ్యవస్థ పనితీరు, నరాల వ్యవస్థ పనితీరు ఇవన్నీ ఈ జీవక్రియలో భాగమే. హైపో థైరాటిజంలో ఈ జీవక్రియ నెమ్మదిస్తుంది.

థైరాయిడ్ కారణంగా చాలా మంది అధిక బరువు పెరిగిపోతుంటారు. సంతాన సమస్యలు తలెత్తుతాయి. జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. ఈ సమస్యలన్నింటినీ భరించాల్సి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించే ఆహారా పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

థైరాయిడ్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ లో అరటి మొదటి స్థానంలో ఉంటుంది. అరటి పండు మాత్రమే కాదు.. పచ్చి అరటి కూడా తినొచ్చు. పండు లాగానే కాకుండా.. సాంబారు, రైతా, కర్రీ.. ఇలా ఏదో ఒక రూపంలో అరటి తీసుకోవాలి. ప్రతిరోజూ ఓ అరటి పండు తింటే థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇక మరో ముఖ్యమైన ఆహారం చేప. ఉడకపెట్టిన చేపను ఆహారంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ ని తగ్గించుకోవచ్చు. లేదంటే కనీసం క్రంటోల్ లో ఉంచొచ్చు.  అయితే.. దీనిని రాత్రి పూట మాత్రం తినకూడదు. వారానికి రెండు సార్లు చేప తింటే హైపో థైరాయిడ్ ని కంట్రోల్ లో ఉంచొచ్చు.

వీటితోపాటు కిచిడీ, పొంగల్.. వీటిలో కూడా థైరాయిడ్ ని కంట్రోల్ చేసే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా టీ3, టీ4 రకం థైరాయిడ్స్ ని పూర్తిగా తగ్గించడానికి సహాయపడుతుందట.

అంతేకాకుండా పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బీ ఎక్కువగా ఉండే ఆహారాలను తసుకోవాల్సి ఉంటుంది. ఇక.. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయా వంటి వాటికి మాత్రం దూరంగా ఉండాలి. బాగా ఉడకపెట్టనిది వీటిని తినకుండా ఉండటమే మంచిది. 

click me!