ఇలా ఆమ్లేట్ వేయాలంటే అబ్బో.. చాలా టాలెంట్ ఉండాలి.. (వీడియో)

By telugu news teamFirst Published Sep 6, 2021, 3:14 PM IST
Highlights

జపనీస్ వారు ఏది చేసినా అందులో ఎంతో కొంత కళ ఉట్టిపడేలా ఉండాలని అనుకుంటారు. 

ఎంత వంట చేయడం రానివారు కూడా.. మాకు మ్యాగీ చేయడం వచ్చు.. ఆమ్లేట్ వేయడం వచ్చు అని చెబుతుంటారు. ఎందుకంటే.. ఇవి తయారు  చేయడం చాలా సులభమని అందరూ భావిస్తుంటారు. ముఖ్యంగా ఆమ్లేట్ వేయడమైతే.. అసలు అదో పెద్ద బ్రహ్మ విద్యా అన్నట్లు మాట్లాడుతుంటారు. అయితే.. ఈ వీడియో చూస్తే మాత్రం .. వంట వచ్చినవారు సైతం.. ఇలా ఆమ్లేట్ వేయడం మా వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తారు. కానీ.. ఒక్కసారైనా ఇలాంటి ఆమ్లేట్ రుచి చూడాలని ఆశపడటం మాత్రం ఖాయం.

ఇంతకీ మ్యాటరేంటంటే..  జపనీస్ వారు ఏది చేసినా అందులో ఎంతో కొంత కళ ఉట్టిపడేలా ఉండాలని అనుకుంటారు. అందులో భాగంగానే జ పాన్ కి చెందిన  ఓ వ్యక్తి తన సోషల్ మీడియా పేజీలో ఆమ్లేట్ వేస్తున్న వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో చూసినవాంతా వ్వా అనేస్తున్నారు.

 

ఆమ్లెట్ వేయంలో గొప్పేముంది అనుకునేవారు.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మళ్లీ జన్మలో ఆ మాట అనరు. ఆమ్లెట్ కూడా ఇంత అందంగా.. అద్భుతంగా వేయవచ్చా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు కూడా. ప్యాన్ లో వేసిన ఆమ్లేట్ ని.. రెండు పుల్లలతో ( చాప్ స్టిక్స్)  అందంగా.. పువ్వులా తిప్పేశాడు. ఆ ఆమ్లేట్ ని తర్వాత.. రైస్ మీద పెట్టాడు. చాలా అందంగా ఉన్న రెసిపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు 170వేలకు పైగా వ్యూస్ రావడం విశేషం. కావాలంటే.. ఈ అద్భుతమైన  వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

click me!