ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుండటంతో.. దీనినే అందరూ ప్రిఫర్ చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు... ఈ వడాపావ్ కూడా చాలా కాస్ట్ లీ గా మారిపోయింది.
ముంబయి స్ట్రీట్ ఫుడ్ లో బెస్ట్ ఏది అనగానే.. ఎవరైనా వెంటనే చెప్పేది వడాపావ్. ఈ వడాపావ్ ని ముంబయి ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ దేశంలో చాలా ప్రాంతాల్లో లభిస్తోంది కూడా. చాలా మంది భోజనం, లంచ్ గా కూడా ఈ వడాపావ్ ని తినేస్తారు. ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుండటంతో.. దీనినే అందరూ ప్రిఫర్ చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు... ఈ వడాపావ్ కూడా చాలా కాస్ట్ లీ గా మారిపోయింది. దుబాయి లోని ఓ రెస్టారెంట్ అత్యంత ఖరీదైన వడాపావ్ తయారు చేశారు.
దుబాయ్ లో చేసిన ఓ వడాపావ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే అది అచ్చమైన బంగారంతో చేసినది. మరి ధర ఎంతుంటుందనుకుంటున్నారు. దుబాయ్ కరెన్సీలో బంగారంతో చేసిన వడాపావ్ ధర 99 dirham. అదే మన భారత్ కరెన్సీలో దాదాపు రూ.2000. 22 క్యారెట్ల బంగారం తో దీనిని తయారు చేశారు.
రమాలో ఉన్న భారతీయ స్లయిడర్‌లకు సేవలు అందించడంలో ప్రసిద్ధి చెందిన ఓ పావో ‘కాస్ట్లీ’ పావ్‌ని ప్రవేశపెట్టింది. దీని ధర 99 దిర్హామ్ మన కరెన్సీలో సుమారు రూ. 2,000. ట్విట్టర్ లో మసరత్ దౌడ్ ఈ వడాపావ్ ని షేర్ చేయగా.. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోని 20 వేల మందికి పైగా చూశారు. మరి ఇంత కాస్ట్లీ వెరైటీ వడాపావ్ ను సాధారణంగా ప్లేట్ లో పెట్టేసి ఇచ్చేస్తే వాల్యూ ఏంటుంది? అందుకే ప్రజంటేషన్ లో ఏమాత్రం తీసిపోకుండా 22 క్యారెట్ల బంగారం వడాపావ్ రేంజ్ లోనే ప్రజంటేషన్ కూడా ఉంది. పొగలుకక్కుతున్న ఈ గోల్డెన్ వడాపావ్ ని చిన్న చెక్క డబ్బాలో పెట్టి ఇస్తారు. ఈ వడాపావ్ తో పాటు స్వీట్ పొటాటో ఫ్రైస్ మరియు పుదీనా లేమనేడ్ ని కూడా అందజేస్తున్నారు.