అతను ఆర్డర్ చేసిన సమోసాల్లో అతనికి ఓ విచిత్రం కనపడటంతో.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ సమోసాలు తయారు చేసేవారు.. వాటికి సీరియల్ నెంబర్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.
వర్షం పడుతున్న సమయంలో.. వేడి వేడి సమోసా సాయంత్రం పూట కూర్చొని తింటూ ఉంటే ఎంత మజాగా ఉంటుంది. మన భారతీయులకు సమోసా అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఓ వ్యక్తి కూడా ఇలానే.. సమోసా తినాలని ఆశడ్డారు. వాటిని తినడానికి ఓ రెస్టారెంట్ లో ఆర్డర్ కూడా పెట్టాడు.. అతను ఆర్డర్ చేసిన సమోసాల్లో అతనికి ఓ విచిత్రం కనపడటంతో.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ సమోసాలు తయారు చేసేవారు.. వాటికి సీరియల్ నెంబర్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.
అసలు మ్యాటరేంటంటే.. ఓ ట్విట్టర్ యూజర్ ఆన్‌లైన్‌లో సమోసా ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ మేరకు అతనికి సమోసాలు చేరాయి కూడా. అయితే ఆ సమోసాల దిగువన సీరియస్ నంబర్స్ ఉన్నాయి. అది చూసి అతను షాక్ అయ్యాడు. సమోసాలకు సీరియల్ నెంబర్లు ఏంటి అనే సందేహంతో.. వెంటనే ఆ సమోసాలను ఫోటో తీశాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
‘‘నేను ఆర్డర్ చేసిన సమోసాలకు క్రమ సంఖ్యలు ఉన్నాయి. టెక్నాలజీ పీక్స్‌లోకి వెళ్లిపోయిందనడానికి ఇదే నిదర్శనం’’ అని క్యాప్షన్ పెట్టాడు.
Samosas I ordered had serial numbers 🙄 Can tech pls stay away from my halwai. pic.twitter.com/DKo1duIiC9
— Nitin Misra (@nitinmisra)కాగా, సదరు యూజర్ ఆ సమోసాల పిక్‌ను పోస్ట్ చేయడమే ఆలస్యం అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ను వందలాది మంది రీట్వీట్ చేశారు. దాదాపు 15 వేల మందికిపైగా లైక్స్ కొట్టారు. ఈ సీరియల్ నెంబర్ సమోసాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.