ఈ కుల్ఫీలను చాలా సింపుల్ గా.. అతి తక్కువ వస్తువులతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా మామిడి కాయలతో.. ఈ మ్యాంగో సీజన్ లో .. టేస్టీ అండ్ సింపుల్ కుల్ఫీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఈ ఎండాకాలంలో మామిడి పండు తినడం, ఐస్ క్రీమ్, కుల్ఫీ లాంటివి తినడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. సమ్మర్ వస్తే.. అందరూ ఎక్కువగా ఇష్టంగా లాగించేది వీటినే. ముఖ్యంగా పిల్లలు.. ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు అంటే మరింత ఎక్కువ ఇష్టం చూపిస్తారు. అయితే.. ఈ కుల్ఫీలను చాలా సింపుల్ గా.. అతి తక్కువ వస్తువులతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా మామిడి కాయలతో.. ఈ మ్యాంగో సీజన్ లో .. టేస్టీ అండ్ సింపుల్ కుల్ఫీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
రెండు పండు మామిడి పండ్లు( ముక్కలుగా కోయాలి)
రబ్డీ ముప్పావు కప్పు
బ్రెడ్.. రెండు స్లైస్
పాలు పావు కప్పు
పంచదార( అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు)
బాదం, పిస్తా పప్పులు( సన్నగా తరిగి ఉంచుకోవాలి)
తయారీ విధానం.. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని.. అందులో.. సన్నగా తరగిని మామిడిముక్కలు, రబ్డీ, బ్రెడ్, పాలు , పంచదార వేసుకొని మెత్తగా పేస్టు లాగా చేసుకోవాలి. మెత్తగా.. పేస్టులాగా వచ్చిన ద్వారా మిక్సీ చేసుకోవాలి.
ఇప్పుడు ఏదైనా ఒక ఐస్ ట్రే తీసుకొని.. అంందులో ముందుగా.. సన్నగా తరిగి పెట్టుకున్న బాదం, పిస్తా ముక్కలు వేయాలి. ఆ తర్వాత.. వాటిపై ముందుగా తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్టుని అందులో వేయాలి.
అంతే దానిలో పాప్ స్టిక్స్( ఐస్ క్రీమ్ పుల్ల) ఒక్కోదాంట్లో ఒక్కోటి పెట్టేయాలి. తర్వాత.. ఆ ఐస్ ట్రేని.. డీప్ ఫ్రిడ్ఝ్ లో దాదాపు 8 గంటల పాటు ఉంచాలి. అంతే.. రుచికరమైన టేస్టీ... మ్యాంగో కుల్ఫీ తయారుఅయిపోయినట్లే. ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే.. ఈ కింద వీడియో చూడండి