Sankranti 2022: భారతదేశం అనేక సంప్రాదాయాలకు, పండుగలకు నెలవు. అందులో సంక్రాంతి పండుగ తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైనది. మరి ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని అనేక పిండి వంటలు, స్వీట్లు చేస్తుంటారు. ఆ స్వీట్లలో వేరు శనగలు, బెల్లంతో చేసిన స్వీట్ ఎంతో స్పెషల్.
Sankranti 2022: సంక్రాంతి పండుగ తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన ఫెస్టివల్. ఇంటి నిండా చుట్టాలతో కోలాహలంగా మారిపోతుంది. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు ఈ పండుగకు ఇంటికి చేరుకుని అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. పట్టణాలు, పళ్లెలు అంటూ తేడా లేకుండా సంక్రాంతి సంబురాలు ఇప్పటికే అంబురానంటుతున్నాయి. ఇంటిముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల కోలాహలం, హరిదాసుల కీర్తణలు ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నాలుగు రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే భోగి పండుగను 14 వ తేదీన జరుపుకుంటారు.
పొద్దు పొద్దునే ఇంటిళ్లి పాది లేచి భోగి మంటలు వేసి.. అందులో పాత వస్తువులను వేసి సకల సౌభాగ్యాలు ప్రసాదించమని ఆ దేవుడిని మొక్కుతారు. అయితే ఈ పండుగ స్పెషల్ గా రకరకాల పిండివంటలు, స్వీట్లను తయారుచేస్తుంటారు. అయితే భోగి స్పెషల్ గా శనగ బర్ఫీ ఎంతో ప్రత్యేకమైనది. కేవలం కొన్ని Ingredients తో ఈ స్వీట్ ను సింపుల్ గా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ కు కేవలం 5 రకాల పదార్థాలే అవసరమవుతాయి. కేవలం 30 minutes లో ఈ స్పెషల్ స్వీట్ ను తయారుచేసుకుని తినేయొచ్చు. ఈ స్వీట్ పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పదండి ఈ స్వీట్ ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వేరశనగలు, రెండు చిన్న చెంచాల పాలు, రెండు చిన్న చెంచాల నెయ్యి, 1/2 కప్పు జీడిపప్పు ను తీసుకోవాలి.
తయారుచేసే విధానం: స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో వేరు శనగలు వేసి మాడిపోకుండా కాల్చాలి. తర్వాత వాటిని కిందికి దించి వాటి చర్మం ఊడదీయాలి. ఆ తర్వాత వాటిని కాసేపు చల్లారనివ్వాలి. వీటిని పక్కన పెట్టేసి మరో బాణలి తీసుకుని శనగపిండిని పోసి అది లైట్ గా Gold కలర్ రాగానే దించి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత చల్లారిన వేరు శనగలు, జీడిపప్పును గ్రైండ్ చేసుకోవాలి. అయితే అది పూర్తిగా పౌడర్ లా కాకుండా ముతక పొడిలా ఉండేలా చూసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుని బెల్లం సిరప్ తయారు చేసుకోవాలి. దీనికోసం స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని అందులో 1/4 కప్పు నీళ్లలో బెల్లం వేసి బాగా మిక్స్ చేయాలి. అయితే మంటను మీడియంగానే ఉండేట్టు చేసుకోవాలి.
ఆ మిశ్రమం చిక్కగా అయ్యే వరకు స్టవ్ పైనే ఉంచాలి. ఆ సిరప్ తిక్ గా మారితే దించి పక్కన పెట్టుకోవాలి. ఈ సిరప్ లో గ్రైండ్ చేసుకున్న జీడిపప్పుు, వేరుశనగ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో నెయ్యి, పాలు వేసి మిక్స్ చేయాలి. దీన్ని కాసేపు సన్నటి మంట మీద ఉడికించండి. అయితే దాన్ని కలుపుతూనే ఉండాలి. ఆ మిశ్రమం పూర్తిగా చిక్కగా మారే వరకు మంటపై ఉంచి కలుపుతూ ఉండాలి. అది లేత గోధుమ రంగు లోకి వచ్చినట్టైతే దాన్ని కిందికి దించుకోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పార్చ్ మెంట్ పేరర్ పెట్టి ఉన్న ఒక ట్రేలో వేయాలి. ఆ మిశ్రమం కొంచెం చల్లబడితే దాన్ని మీకు ఏ షేప్ నచ్చితే అదే మాదిరిగా కట్ చేసుకుంటే శనగ బర్ఫీ రెడీ అయినట్టే. అయితే ఈ స్వీట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మాత్రం గాలి వెళ్లని డబ్బాలో పెట్టుకోవాలి.