శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వంటనూనె విషయంలో. కొలెస్ట్రాల్ ఉన్నవారు వంటకు ఏ నూనె ఉపయోగించాలో తెలుసా?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ కావడంవల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, కాలేయ వ్యాధి, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా వరకు పెరుగుతుంది. ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలంటే మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో కొలెస్ట్రాల్ పేషెంట్లు ఉన్నా మీరు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో. వెన్న, నెయ్యితో సహా ఆహార పదార్థాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలాగే మీరు తినే ఆహారంలో ఏ వంటనూనెను ఉపయోగిస్తే మంచిదో కూడా తెలుసుకోవాలి. మీ ఇంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఉంటే.. వంటకు ఏ నూనెను ఉపయోగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనెలో ఇతర నూనెల కంటే మోనో-అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ నూనెను వంటలో ఉపయోగించి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. కాబట్టి వేరే నూనెలకు బదులుగా రోజూ వంటల్లో ఆలివ్ ఆయిల్ ను వాడండి.
undefined
అవిసె గింజల నూనె: అవిసె గింజల నూనెలో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లం. ఈ నూను శరీర మంటను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
సోయాబీన్ నూనె: సోయాబీన్ నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను వంటల్లో తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గడం ప్రారంభమవుతాయి. గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.
నువ్వుల నూనె: నువ్వుల నూనెలో పాలీఅన్శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. నువ్వుల నూనె మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి మీ వంటల్లో ఈ నూనెను ఉపయోగించండి.
పొద్దుతిరుగుడు నూనె: హెల్తీ లైఫ్ ను గడపాలనుకుంటే మీరు మీ రోజువారి వంట్లో పొద్దుతిరుగుడు నూనెను కూడా ఉపయోగించొచ్చు. పొద్దుతిరుగుడు నూనెలో పాలీఅన్శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.