కొంతమంది ఉదయాన్నే కాకుండా.. రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా అరటిపండును తింటుంటారు. కానీ ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
పండ్లలో ఒకటైన అరటిపండు మన ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఈ పండును తింటే మనకు వెంటనే ఎనర్జీ అందుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి కూడా ఉపయోగపడతుంది. అందుకే ఈ పండును రోజూ తినేవారు ఉన్నారు. అయితే కొంతమందికి డిన్నర్ తర్వాత అరటిపండ్లను తినే అలవాటు ఉంటుంది. కానీ ఇలా భోజనం తర్వాత అరటిపండ్లను తినొచ్చా? తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రాత్రి భోజనం తర్వాత అరటిపండ్లను తింటే ఫుడ్ త్వరగా అరుగుతుందని చాలా మంది చెప్తుంటారు. అయితే కొంతమంది మాత్రం బరువు పెరగడానికి భోజనం తర్వాత అరటిపండ్లను తింటారు. ఇది మంచే. అయినప్పటికీ ఇలా అరటిపండ్లను తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
undefined
శరీరానికి మంచిది కాదు: రాత్రి భోజనం తర్వాత ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో రాత్రి భోజనం తర్వాత అరటిపండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే?
జలుబు: చలికాలం, వర్షాకాలంలో రాత్రిపూట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల జలుబు వస్తుంది. అంతేకాదు ఇది ఫ్లూకు దారితీస్తుంది. అలాగే కొంతమందికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస సమస్యలు కూడా వస్తాయి.
జీర్ణ సమస్య : గుడ్లు, చికెన్, మాంసం వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటుగా అరటిపండ్లను తింటే గనుక మీకు జీర్ణ సమస్యలు వస్తాయి.
లంచ్ టైంలో: మీరు అరటిపండును తినాలనుకుంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత తినండి. ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడమే కాకుండా.. మీకు జలుబు లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది.
సాయంత్రం పూట: అరటి పండ్లను మీరు లంచ్ టైం లోనే కాకుండా సాయంత్రం పూట కూడా తినొచ్చు. ఎందుకంటే అరటి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు రాత్రి భోజనం తక్కువగా చేస్తారు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.