రోజూ దానిమ్మ గింజలు తింటే ఏమౌతుందో తెలుసా?

By ramya SridharFirst Published Oct 2, 2024, 8:32 AM IST
Highlights

రోజూ ఒక చిన్న గిన్నెడు దానిమ్మ గింజలు తింటే ఏమౌతుందో తెలుసా? ఒక నెల రోజుల పాటు గ్యాప్ ఇవ్వకుండా తింటే మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో, మనకు కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...
 

దాదాపు అందరికీ నచ్చే పండ్లలో దానిమ్మ కూడా ముందు వరసలో ఉంటుంది. దాని తొక్క తీయడం ఒక్కటే కష్టం. ఎవరైనా ఒలిచి పెడితే.. హ్యాపీగా ఎన్ని గింజలు తింటున్నామో కూడా తెలీకుండానే తినేయవచ్చు. అయితే... రోజూ ఒక చిన్న గిన్నెడు దానిమ్మ గింజలు తింటే ఏమౌతుందో తెలుసా? ఒక నెల రోజుల పాటు గ్యాప్ ఇవ్వకుండా తింటే మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో, మనకు కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...

దానిమ్మ గింజల్లో పోషక విలువలు...

1.క్యాలరీలు 72
2.ఫ్యాట్ 1 గ్రామ్
3.శాచురేటెడ్ ఫ్యాట్ 0.1గ్రామ్
4.కార్బోహైడ్రేట్స్ 16గ్రాములు
5.సోడియం 2.6మిల్లీ గ్రాములు
6.షుగర్ 11.9గ్రాములు
7.ఫైబర్ 3.48గ్రాములు
8.ప్రోటీన్ 45 గ్రాములు
9.పొటాషియం 205 మిల్లీ గ్రాములు

Latest Videos

దానిమ్మ గింజలను రెగ్యులర్ గా తినడం వల్ల ప్రయోజనాలు...

1.బ్లడ్ ప్రెజర్ మేనేజ్మెంట్ గా దానిమ్మ..


రోజూ దానిమ్మ గింజలు తినడం వల్ల రక్త పోటు సమస్య ఉండదు. మీలో ఎవరికైనా రక్తపోటు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు ఉంటే.. రెగ్యులర్ గా ఈ దానిమ్మ గింజలు తింటే చాలట. దానిమ్మ గింజలు మాత్రమే కాదు.. జ్యూస్ తాగినా కూడా హైపర్ టెన్షన్ తగ్గుతుందట.

2. దానిమ్మతో ఇన్ఫెక్షన్లు దూరం...


ఈ మధ్యకాలంలో మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం, ఇన్ఫెక్షన్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే... కచ్చితంగా దానిమ్మ గింజలను తినాలట. ఎందుకంటే... దానిమ్మ గింజలను తినడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు తొందరగా రావు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోజూ తింటే... మీరు జబ్బుల బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

3.మెమరీ బూస్టర్ దానిమ్మ..


రోజూ ఒక చిన్న గిన్నెడు దానిమ్మ గింజలను తినడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుందట. కేవలం వరసగా నాలుగు వారాలు కంటిన్యూస్ గా ఈ గింజలు తిన్నా, లేదంటే జ్యూస్ తాగినా.. తెలివి తేటల్లో మార్పులు వస్తాయట.  జ్నాపకశక్తి కచ్చితంగా పెరుగుతుంది.  అల్జీమర్స్ సమస్య రాకుండా ఉంటుంది.

4.గుండె ఆరోగ్యం పెంచే దానిమ్మ..


LDL ('చెడు కొలెస్ట్రాల్') తగ్గించడం,  HDL ('మంచి కొలెస్ట్రాల్') పెంచడం ద్వారా దానిమ్మ సారం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చూపించాయి.  చెడు కొలిస్ట్రాల్  ధమనులలో పేరుకుపోతుంది. ఇది  గుండెపోటు లేదా స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు హెచ్‌డిఎల్, రక్తంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను విసర్జన కోసం కాలేయానికి తీసుకురావడం ద్వారా శరీరం తొలగించడంలో సహాయపడుతుంది. ఎల్‌డిఎల్‌ని తగ్గించడంలో, హెచ్‌డిఎల్‌ని పెంచడంలో సహాయం చేయడం ద్వారా, దానిమ్మలు గుండె జబ్బులు లేదా గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

5.క్యాన్సర్ లక్షణాలు తగ్గించే దానిమ్మ..


ఏ ఆహారం ఖచ్చితంగా క్యాన్సర్‌ను నిరోధించదు లేదా నయం చేయలేనప్పటికీ  దానిమ్మ రసం, పండు , ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలపై, అలాగే రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ వంటి వాటిపై ప్రభావం చూపడంపై మంచి పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ దరిచేరకుండా ఉంటుంది.

6.  మూత్ర విసర్జన ఆరోగ్యానికి తోడ్పడే దానిమ్మ..


ఆక్సీకరణ ఒత్తిడి మూత్రపిండాల్లో రాళ్లకు ప్రమాద కారకం. దానిమ్మపండు రసం, దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు,  యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లతో, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

click me!