వీళ్లు వెల్లుల్లిని అస్సలు తినొద్దు

By Shivaleela RajamoniFirst Published Oct 1, 2024, 3:29 PM IST
Highlights

అల్లం, వెల్లుల్లిని మనం దాదాపుగా ప్రతి ఒక్క కూరలో వేస్తుంటాం. ఇది వంటలను టేస్టీగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. కానీ వెల్లుల్లిని కొంతమంది అస్సలు తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వెల్లుల్లి టేస్ట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అందుకే ప్రతి కూరలో ఖచ్చితంగా వెల్లుల్లిని వేస్తుంటారు. వెల్లుల్లి ఇండియన్ వంటకాల్లో ఒక సాధారణ మసాలా దినుసు. దీని ఘాటైన టేస్ట్ ఫుడ్ రుచిని పెంచడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వెల్లుల్లిని చలికాలంలో తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 

వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఎంతగానో సహాయపడుతుంది. దీనిని తింటే మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఒక వస్తువు వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు.. దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అంటే వెల్లుల్లిని తింటే కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా వీటిని ఎక్కువగా తింటేనే సమస్యలు వస్తుంటాయని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వీటిని కొద్దిగా తిన్నా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Latest Videos

సాధారణంగా వెల్లుల్లి అధిక రక్తపోటు ఉన్నవారికి, రక్తంలో కొలెస్ట్రాల్ లేదా ఇతర కొవ్వులు ఎక్కువగా ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లిని ఉపయోగించి జలుబు, ఆస్టియో ఆర్థరైటిస్ తో పాటుగా ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. 

వెల్లుల్లి డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి పొడిని నోటి ద్వారా తీసుకుంటే షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. ఇందుకోసం దీన్ని భోజనానికి ముందు తీసుకోవాలి. దీన్ని మీరు 3 నెలలైనా తీసుకుంటే పరిస్థితి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. 

వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు: వెల్లుల్లి ఆరోగ్యానికి మంచి చేసేదే అయినా.. దీనిలో ఉండే సమ్మేళనాలు కడుపు పొరను చికాకుపెడతాయి. ముఖ్యంగా వీటిని పరిగడుపున తిన్నప్పుడు అజీర్ణం, గుండెల్లో మంట, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. 

అసిడిటీ సమస్యలు:  మీకు తెలుసా? వెల్లుల్లి  మన కడుపులో ఎక్కువ మొత్తంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ సమస్య తో బాధపడేవారిలో సమస్యను మరింత పెంచుతుంది. అందుకే ఇలాంటి సమస్య ఉన్నవారు వెల్లుల్లిని ఎక్కువగా తినకూడదు. 

విరేచనాలు: వెల్లుల్లిని మోతాదుకు మించి తింటే విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది. సాధారణంగా వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనం భేదిమందు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే దీన్ని ఎక్కువగా తింటే విరేచనాల సమస్య వస్తుంది. ముఖ్యంగా సున్నితమైన వ్యక్తులకు ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. 

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని ఎవరు తినకూడదు?

పరిగడుపున వెల్లుల్లిని తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయన్న సంగతి చాలా మందికి తెలుసు. ఇలా తినేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు పరిగడుపున వెల్లుల్లిని తర్వాత తర్వాత దైనా జీర్ణ అసౌకర్యంగా అనిపించినా దీన్ని ఖాళీ కడుపుతో తినడం పూర్తిగా మానేయండి.  అలాగే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జిఇఆర్డి సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని పరిగడుపున తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యలను మరింత పెంచుతుంది. 

రక్తం సన్నబడటానికి వెల్లుల్లి ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. అందుకే ఒకవేళ మీరు రక్తం సన్నబడటానికి మందులు తీసుకుంటుంటే డాక్టర్ ను సంప్రదించిన తర్వాత మాత్రమే తినండి.  అలాగే వెల్లుల్లిని తొందరగా జీర్ణ సమస్యలు వచ్చే వారు కూడా పరిగడుపున తినకూడదు. 

వెల్లుల్లిని పచ్చిగా తినడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల మీకు తలనొప్పి కూడా రావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంటే పచ్చి వెల్లుల్లిని తిన్న వెంటనే మీకు తలనొప్పి రాకపోవచ్చు. కానీ కొద్ది సేపటికైనా తలనొప్పి వచ్చేలా చేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. పచ్చి వెల్లుల్లిని తింటే మెదడులో తలనొప్పిని ప్రేరేపించే న్యూరోపెప్టైడ్లు విడుదల అవుతాయి. 

పచ్చి వెల్లుల్లిని తింటే యోని సంక్రమణ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆడవారు యోని ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పటికే యోని సంక్రమణతో బాధపడుతుంటే వెల్లుల్లిని తినడం మానేయండి. ఎందుకంటే ఇది యోనిలోని సున్నితమైన కణజాలాలకు చికాకు కలిగిస్తుంది. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను పెంచుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. పచ్చి వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా తింటే గుండెల్లో మంట, వాంతులు అవుతాయి. అందుకే వెల్లుల్లి రెబ్బలను ఎప్పుడూ కూడా మోతాదుకు మించి తినకూడదు. 
 

click me!