యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా 'నోటా'. అక్టోబర్ 5న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఏపీలో భారీ సభను నిర్వహించారు. సోమవారం హైదరాబాద్ లో భారీగా మరో సభను నిర్వహించారు.
యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా 'నోటా'. అక్టోబర్ 5న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఏపీలో భారీ సభను నిర్వహించారు.
సోమవారం హైదరాబాద్ లో భారీగా మరో సభను నిర్వహించారు. ఈ వేడుకకు వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నాగఅశ్విన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ''ఆదివారం ఏపీలో పబ్లిక్ మీట్ అయింది.
undefined
అంతకు మించిన రెస్పాన్స్ ఇక్కడుంది. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా చేస్తున్నారు. అఫిడఫిట్లు పెడుతున్నారు. ఎలక్షన్ టైమ్ లో సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరూ నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణాలో ఒక పార్టీకి ఫేవర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
అలాంటి ఇష్యూస్ ఈ సినిమాలో లేవు. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ. అయినా ఈ సినిమా చూసి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు. ఏం చేయాలో వాళ్లకు బాగా తెలుసు'' అంటూ చెప్పుకొచ్చారు. ఇక టైమ్ లేదు.. కౌంట్ డౌన్ మొదలైంది అంటూ విజయ్ పలికిన మాటలకి ఆడిటోరియం మొత్తం హోరెత్తించారు అభిమానులు.
సంబంధిత వార్తలు..
నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?
రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!