పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

Published : Oct 01, 2018, 11:10 PM IST
పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

సారాంశం

బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కి పేక్షకుల్లో ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది అభిమానులు కోరుకున్నట్లుగా కౌశల్ బిగ్ బాస్ షో విజేతగా నిలిచారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కి పేక్షకుల్లో ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది అభిమానులు కోరుకున్నట్లుగా కౌశల్ బిగ్ బాస్ షో విజేతగా నిలిచారు. కౌశల్ విజేతగా నిలవడంతో కౌశల్ ఆర్మీ సంబరాలకు అంతేలేదు. 

తన విజయం కోసం కౌశల్ ఆర్మీ చేసిన కృషిని పొగిడిన కౌశల్ ఈ సంధర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని తలచుకున్నాడు. ఆయన తనకిచ్చిన ఇన్స్పిరేషన్ ని గుర్తుతెచ్చుకున్నాడు. ''నాకు పవన్ కల్యాణ్ గారంటే చాలా ఇష్టం. ఒక రోజు ఆయన నా భుజం మీద చేయి వేసి నా కృషి, పట్టుదల చూస్తుంటే ముచ్చటగా ఉంది.

జీవితంలో ఎంత కష్టపడుతున్నావో.. ఆ కష్టాన్ని పదికాలాల పాటు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. నేను బిగ్ బాస్ విజేతగా నిలవడం కోసం పడ్డ కష్టాన్ని జీవితాంతం నిలిచేలా ఉపయోగించుకుంటాను'' అంటూ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్