
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కి సంబంధించిన విషయాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని అంటుంటారు. పవన్ పొలిటికల్ స్పీచ్ లన్నీ కూడా త్రివిక్రమ్ రాసి ఇస్తాడని టాక్.
తాజాగా ఈ విషయాలపై మాట్లాడాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుంటుందని మీరు సలహాలు ఇవ్వలేదా..? అని త్రివిక్రమ్ ని ప్రశ్నించగా.. 'సలహాలా.. భలేవారండీ. సలహాలు ఇచ్చేంత సీన్ ఉందా..?' అని అన్నాడు.
రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు పవన్ మీకేమైనా చెప్పారా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. 'నాకెందుకు చెబుతారు. ఆయన తన అన్నయ్యకే ఏం చెప్పడు. ఓ స్నేహితుడిగా ఇప్పటికీ నేను ఆయనతో టచ్ లో ఉన్నాను. ఆయన రాజకీయ ప్రసంగాలు నేను రాస్తున్నానని అంటున్నారు.
నా స్క్రిప్ట్ లు రాసుకోవడానికే నాకు బద్ధకం ఎక్కువ. ఇక రాజకీయ ప్రసంగాలు ఎలా రాస్తాను. నాకు రాజకీయాలకి బాగా దూరం. నిజానికి నేను టీవీ చూడను, పేపర్లు చదవను.. ఇక రాజకీయాలేం తెలుస్తాయి' అంటూ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!
మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!
పగబట్టినా పర్ఫెక్ట్ గా పట్టాలి.. అదే త్రివిక్రమ్ స్టైల్!
'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?