Mahesh Babu : సంక్రాంతికి సర్కారువారి పాట సందడి షురూ.. సూపర్ స్టార్ అభిమానులకు పండగే..

Published : Jan 08, 2022, 02:33 PM IST
Mahesh Babu : సంక్రాంతికి సర్కారువారి పాట సందడి షురూ.. సూపర్ స్టార్ అభిమానులకు పండగే..

సారాంశం

సంక్రాంతికి సందడి షురూ చేయబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu). సర్కారువారి పాట సినిమాను సంక్రాంతికి ఎలాగో రిలీజ్ చేయలేకపోయారు.. ఇక ప్రమోషన్స్ హడావిడి అయినా స్టార్ట్  చేద్దాం అనుకుంటున్నారు.

సంక్రాంతికి సందడి షురూ చేయబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu). సర్కారువారి పాట సినిమాను సంక్రాంతికి ఎలాగో రిలీజ్ చేయలేకపోయారు.. ఇక ప్రమోషన్స్ హడావిడి అయినా స్టార్ట్  చేద్దాం అనుకుంటున్నారు.

 

సూపర్ స్టార్ మహేష్ బాబుకు(Super Star Mahesh Babu) సంక్రాంతి సెంటిమెంట్ బాగా ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి వచ్చే సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈసారి సర్కారువారి వారి పాట(Sarkaru vaari paata) సినిమాను కూడా 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ అందరికంటే ముందే ప్రకటించారు. కాని అనుకున్నది ఒకకటి..అయినది ఒక్కటీ అన్నట్టు ట్రిపుల్ ఆర్(RRR) వల్ల.. అందరికంటే ముందు.. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుని.. సమ్మర్ రేసుకు వెళ్లిపోయింది. ఏప్రిల్ 1న సర్కారువారి పాట రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు టీమ్.

ఇక సక్రాంతి ఎలాగూ రిలీజ్ మిస్ అయ్యంది. కనీసం సినిమా ప్రమోషన్లు అయినా.. అఫీషయల్ గా సంక్రాంతికి స్టార్ట్ చేద్దాం అనకుంటున్నారు మూవీ టీమ్. సంక్రాంతి నుంచి సూపర్ స్టార్ అభిమానులు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అప్ డేట్స్ వదలబోతున్నారట. కొంచెం డిఫరెంట్ గా ప్రమోషన్లు ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నారట టీమ్. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతున్నట్టు తెలుస్తోంది.

అందులోనూ సర్కారు వారి పాట(Sarkaru vaari paata) సినిమా షూటింగ్  కూడా దాదాపు కంప్లీట్ అయినట్టే.. ఒక షెడ్యూల్ తో పాటు చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ బ్యాలన్స్ ఉన్నాయి. ఇంకా రిలీజ్ కు రెండున్నర నెలల పైనే టైమ్ ఉండటంతో.. ఈ షూటింగ్ వర్క్ కంప్లీట్ చేయడం పెద్ద పనేం కాదు. అసలు రీసెంట్ గా మహేష్ బాబు(Mahesh Babu)  కాలుకు సర్జరీ జరగకపోయి ఉంటే ఇప్పటికే సర్కారు వారి పాట షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టేవారు. ఈ నెలలో షూటింగ్ చేద్దాం అంటే మహేష్ కు కరోనా వచ్చింది. దాంతో వరుసగా పోస్ట్ పోన్ చేసుకోవల్సి వస్తుంది.

 

సర్కారువారి పాట నుంచి ఫస్ట్ సింగిల్ ను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారట టీమ్. దానికి సంబంధించి తమన్ పాటలు కంప్లీట్ చేయగా.. షూటింగ్.. ఎడిటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇప్పటి వరకూ సర్కారువారి వారి పాట నుంచి వచ్చిన చిన్నా.. చితకా అప్ డేట్స్ కే భారీ గా రెస్పాన్స్ వచ్చింది. ఇక పెద్ద పెద్ద అప్ డేట్స్ స్టార్ట్ అయితే మహేష్  ఫ్యన్స్ పండగ చేసుకోవడం ఖాయం.

Also Read: Dhanush Sir Movie : ‘సార్ ’ మూవీ షూటింగ్ ఆపేసిన ధనుష్.. కారణం అదేనా..?

గీతగోవిదం ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ .. 14రీల్స్ వారితో కలిసి మహేష్ బాబు(Mahesh Babu) ఈసినిమాను నిర్మిస్తున్నారు. సముద్ర ఖని విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు. తమన్(Thaman) మ్యూజిక్ అందించిన సర్కారువారి పాట... ఏప్రిల్ 1న రీలీజ్ కు ముస్తావు అవుతోంది.

Also Read: Pushpa OTT: 'పుష్ప' ఓటీటీ వెర్షన్ లో ఆ సీన్స్ లేవు,ఫ్యాన్స్ నిరాశ?

PREV
click me!

Recommended Stories

Bharani: తన ఒరిజినాలిటీ బయటపెట్టిన భరణి.. మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాటజీ పనిచేస్తుందా?
Akira Nandan నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ క్రేజీ రియాక్షన్‌