Sukumar: మణిరత్నం వల్ల చాలా బాధపడ్డా.. సుకుమార్ కి ఎదురైన చేదు అనుభవం

By team telugu  |  First Published Jan 8, 2022, 1:22 PM IST

తాను దర్శకుడైన కొత్తల్లో మణిరత్నం గారిని కలిసేందుకు ప్రయత్నించగా చేదు అనుభవం ఎదురైనట్లు సుకుమార్ తెలిపారు. మణిరత్నం వల్ల చాలా బాధపడ్డట్లు కూడా సుక్కు పేర్కొన్నారు. 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికి నార్త్ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. పాన్ ఇండియా చిత్రం కావడంతో నార్త్ లో వచ్చిన రెస్పాన్స్ కి చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం సుకుమార్ పార్ట్ పై ఫోకస్ పెట్టాడు. 

సుకుమార్ ప్రస్తుతం పుష్ప ప్రచారం కోసం వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ తన అభిమాన దర్శకుడు మణిరత్నం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను దర్శకుడైన కొత్తల్లో మణిరత్నం గారిని కలిసేందుకు ప్రయత్నించగా చేదు అనుభవం ఎదురైనట్లు సుకుమార్ తెలిపారు. మణిరత్నం వల్ల చాలా బాధపడ్డట్లు కూడా సుక్కు పేర్కొన్నారు. 

Latest Videos

అప్పటి ఆర్య చిత్రం విడుదలైంది. ముంబైలో మణిరత్నం గారిని తొలిసారి చూశాను. ఆ సమయంలో మణిరత్నం గారు హీరోయిన్ శోభనతో సీరియస్ గా ఏదో డిస్కస్ చేస్తున్నారు. చాలా సేపు ఎదురుచూశాను. కానీ వారిద్దరి చర్చ ముగియలేదు. దీనితో నేనే వెళ్లి మణిరత్నం గారితో మాట్లాడేందుకు ప్రయత్నించా. దీనితో ఆయన కోపంగా వెళ్ళిపో అన్నట్లుగా సైగ చేశారు. 

నేను ఎంతో అభిమానించే దర్శకుడే అలా అనడంతో చాలా బాధపడ్డా అని సుకుమార్ ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ మణిరత్నం గారు అలా ప్రవర్తించడం లో తప్పు లేదని నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. దర్శకుడు సీరియస్ గా స్టోరీ డిస్కస్ చేస్తున్నపుడు ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే కోపం వస్తుంది అని సుకుమార్ తెలిపారు. అప్పటి నుంచి మణిరత్నం గారిని కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు సుకుమార్ తెలిపారు. 

click me!