
ఈ మధ్య చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. వాటి ద్వారా మంచి మంచి ఆర్టిస్ట్ లు బయటకు వస్తున్నారు. అలాంటి వారిలో ఫరియా అబ్ధుల్లా(faria Abdullah) కూడా ఒకరు. మంచి హైట్ తో పాటు బ్యూటీ కూడా కలగలిసి ఉన్న ఈ హీరోయిన్ జాతిరత్నాలు సినిమాలో పర్ఫామెన్స్ తో అలరించింది. ఆతరువాత పెద్దగా అవకాశాలు ఆమెకు దక్కలేదు. అయినా నిరాశపడకుండా ప్రయత్నిస్తూనే ఉంది హీరోయిన్.
అయితే ప్రస్తుతం ఫరియా(faria Abdullah). టైమ్ స్టార్ట్ అయ్యింది. ఆమెకు అవకాశాల వరుస కడుతున్నాయి. రీసెంట్ గా బంగార్రాజులో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. నాగార్జున(Nagarjuna), నాగచైతన్య తో కలిసి ఆడిపాడింది బ్యూటీ. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ మంచి రెస్పాన్స్ సాధించింది. దాంతో ఫరియాపై టాలీవుడ్ దృస్టి పడింది. ప్రస్తుతం నాలుగు సినిమాల వరకూ ఆమె ఖాతాలో ఉన్నట్టు తెలుస్తోంది. వరుస షూటింగ్స్ తో బేబీ బిజీ అయిపోయిందని సమాచారం.
జోరు పెంచిన ఈ హీరోయిన్ ప్రస్తుతం యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh shobhan) తో ఓ సినిమా చేస్తుంది. మేర్లపాక గాంధీ ఈసినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా త్వరలో షూటింగ్ కు వెళ్లబోతోంది. ఇవన్నీ పక్కాన పెడితే ఫరియాను ఓ లక్కీ ఛాన్స్ వరించినట్ట సమాచారం. మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) తో ఆడిపాడే ఛాన్స్ ఫరియాకు వచ్చిందట. రవితేజ రావణాసుర(Ravanasura) సినిమాలో ఫరియా అబ్ధుల్లా నటిస్తుంది.
Also Read : Sukumar: మణిరత్నం వల్ల చాలా బాధపడ్డా.. సుకుమార్ కి ఎదురైన చేదు అనుభవం
అయితే ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుందా.. లేక ఇద్దరు హీరోయిన్లలో ఒకతిగా నటిస్తుందా.. లేక ఐటమ్ సాంగ్ ఏమైనా చేస్తుందా అనేదానిపై క్లారిటీ లేదు. దాదాపు హీరోయిన్ గా ఫరియా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈనెలలో షూటింగ్ కి వెళ్ళబోతున్నారు మేకర్స్. ఇక వీటితో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఫరియా అబ్ధుల్లా సైన్ చేసినట్టు తెలుస్తోంది.
Also Read : Dhanush Sir Movie : ‘సార్ ’ మూవీ షూటింగ్ ఆపేసిన ధనుష్.. కారణం అదేనా..?