లారెన్స్ సినిమాలో శ్రీరెడ్డికి ఛాన్స్.. ఎలా జరిగిందబ్బా..?

Published : Oct 16, 2018, 12:53 PM IST
లారెన్స్ సినిమాలో శ్రీరెడ్డికి ఛాన్స్.. ఎలా జరిగిందబ్బా..?

సారాంశం

కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ పై కూడా కామెంట్స్ చేసింది. అతడు తన ప్రైవేట్ భాగాలను తాకాడని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో వివాదాస్పదంగా మారాయి.

కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ పై కూడా కామెంట్స్ చేసింది. అతడు తన ప్రైవేట్ భాగాలను తాకాడని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో వివాదాస్పదంగా మారాయి.

ఆ సమయంలో లారెన్స్ స్పందించి తనకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చినా.. శ్రీరెడ్డి మాత్రం లారెన్స్ ని బూతులు తిట్టడం మానలేదు. అయితే ఈరోజు ఆమె పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తను బూతులు తిట్టిన లారెన్స్ సినిమాలోనే శ్రీరెడ్డి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి.. ''నా స్నేహితులందరికీ శుభవార్త. నేను లారెన్స్ ను ఆయన ఇంట్లో కలుసుకున్నాను. ఆయన నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. అక్కడ చాలా మంది పిల్లలున్నారు. వారంతా లారెన్స్ తో సంతోషంగా ఉన్నారు. నాకోసం ప్రార్థించారు కూడా. లారెన్స్ నాకు ఇంట్లోనే ఆడిషన్స్ నిర్వహించారు.  తన తదుపరి చిత్రంలో తీసుకుంటున్నానని హామీ ఇచ్చిన లారెన్స్, మంచి పాత్రను ఆఫర్ చేస్తానన్నాడు.

అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ డబ్బును నేను తిత్లీతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను'' అని వెల్లడించింది. కొద్దిరోజుల క్రితం వరకు లారెన్స్ పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి ఇప్పుడు ఆయన సినిమాలో నటిస్తున్నానని చెప్పడం, ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడడంతో తెరవెనుక ఏం జరిగి ఉంటుందా..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు!

ఇవి కూడా చదవండి.. 

లారెన్స్ నన్ను వాడుకున్నాడు.. తన కారణంగా బెల్లంకొండ విలన్ అయ్యాడు: శ్రీరెడ్డి

శ్రీరెడ్డికి లారెన్స్ పంచ్.. 

తెగేవరకు లాగకు.. లారెన్స్ కు శ్రీరెడ్డి వార్నింగ్!

 

PREV
click me!

Recommended Stories

Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?
NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ