వివాదంలో మంగ్లీ బోనాలు సాంగ్... పేరు రాగానే తలకు పొగరెక్కిందా అంటూ..

By team teluguFirst Published Jul 18, 2021, 12:27 PM IST
Highlights

మంగ్లీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పెషల్ సాంగ్ విడుదల చేస్తూ ఉంటారు. తాజాగా 'చెట్టు క్రింద లెక్క కూసున్నవమ్మా చుట్టం లెక్కా మైసమ్మా..;అనే ఓ బోనాలు సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేశారు. 

సోషల్ మీడియా యుగంలో సెలెబ్రిటీలు ఏ చిన్న పొరపాటు చేసిన విమర్శలపాలు కావడం ఖాయం. మాటైనా, పాటైనా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. లేదంటే అనవసరంగా నెటిజెన్స్ విమర్శలకు బలి కావాల్సివస్తుంది. తాజాగా సింగర్ మంగ్లీ ఇలానే ఓ వివాదంలో చిక్కుకున్నారు. జానపద, పల్లె పాటలు, దేవుళ్ళ పాటలకు మంగ్లీ చాల ఫేమస్. భిన్నమైన స్వరం కలిగిన ఆమె ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణిస్తున్నారు. 


ఇక మంగ్లీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పెషల్ సాంగ్ విడుదల చేస్తూ ఉంటారు. తాజాగా 'చెట్టు క్రింద లెక్క కూసున్నవమ్మా చుట్టం లెక్కా మైసమ్మా..;అనే ఓ బోనాలు సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేశారు. స్వయంగా పాడి, ఆమె నర్తించడం జరిగింది. వారం క్రితం విడుదలైన ఈ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ఈ సాంగ్ఇ ప్పటికే 40లక్షలు పైగా వ్యూస్ రాబట్టింది. 


ఐతే ఈ సాంగ్ లోని లిరిక్స్ అభ్యంతర కరంగా ఉన్నాయని కొందరు హిందూ వాదులు మండిపడుతున్నారు. వెంటనే సదరు సాంగ్ లో లిరిక్స్ మార్చాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆ పాటలోని కొన్ని లిరిక్స్ గ్రామ దేవతలను విమర్శిస్తున్నట్లు ఉన్నాయని వాళ్ళ వాదన. ఈ విషయంలో మంగ్లీని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కొంచెం ఫేమ్ రాగానే తలకు పొగరెక్కి ఇలాంటి సాంగ్స్ చేస్తున్నారని అంటున్నారు. ఈ పాటను రామస్వామి అనే లిరిసిస్ట్ రాయగా, రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు.   


ఈ పాట వివాదంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మంగ్లీ కేవలం పాడారని, రాసిన రైటర్ ని తప్పుబట్టాలని కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తుండగా, మరి కొందరు ఇలాంటి సాంగ్స్ పాడడం, నటిచడం తప్పని మరికొందరు అంటున్నారు. 

click me!