బట్టలు విప్పి నగ్నంగా నిల్చోమ్మన్న స్టార్ సింగర్...మరో సంచలన విషయం బయటపెట్టిన చిన్మయి

Published : Oct 12, 2020, 03:33 PM IST
బట్టలు విప్పి నగ్నంగా నిల్చోమ్మన్న స్టార్ సింగర్...మరో సంచలన విషయం బయటపెట్టిన చిన్మయి

సారాంశం

ఫెమినిస్ట్ మరియు మీతూ ఉద్యమకారిణి అయిన చిన్మయి శ్రీపాద మరో సంచలనానికి తెరలేపింది. స్టార్ సింగర్ ఒకరు లేడీ సింగర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోఫియాకు ఈ చేదు అనుభవం ఎదురుకాగా సదరు స్క్రీన్ షాట్స్ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.   

మీటు ఉద్యమాన్ని సింగర్ చిన్మయి శ్రీపాద బాగా ముందుకు తీసుకెళ్లారు. రచయిత వైర ముత్తుపై ఆమె చేసిన పోరాటం అప్పట్లో హాట్ టాపిక్ మారింది. వైర ముత్తును వెనకేసుకొని వచ్చిన కోలీవుడ్ పై కూడా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. ఫెమినిస్ట్ గా చాలా కాలంగా చిన్మయి అలుపెరగని పోరాటం చేస్తుంది. తాజాగా ఓ స్టార్ సింగర్ పై చిన్మయి తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ లేడీ సింగర్ పట్ల తను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె తెలియజేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షూట్స్ తో సహా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

స్విర్జ్ల్యాండ్  కి చెందిన సింగర్ సోఫియా అక్కర 2019లో  స్టార్ సింగర్ అయిన ఒకరికి కాల్ చేశారట. అవకాశాల కోసం ఆమె ఆయనతో మాట్లాడగా ఆమె పట్ల సదరు స్టార్ సింగర్ అసభ్యంగా ప్రవర్తించారట. సింగర్ సోఫియాను స్కైప్ వీడియో కాలింగ్ యాప్ లో బట్టలు విప్పి నగ్నంగా నిల్చోవాలని అడిగాడట. దానికి సోఫియా మీడియా ముందు పెడతాను, ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారా అని ఆగిందట. దానికి ఆ స్టార్ సింగర్ భయపడలేదని ఆమె చెప్పారు. 

ఆ ఇద్దరి మధ్య నడిచిన చాట్ స్క్రీన్ షూట్స్ షేర్ చేస్తూ చిన్మయి సంచలనానికి తెరలేపింది. తనకు జరిగిన అవమానాన్ని అందరికీ తెలిసేలా చేసిన చిన్మయి పట్ల సోఫియా అభిమానం చాటుకుంది. దీనికి సమాధానంగా చిన్మయి ఒక సోదరిలా తనకు ఎప్పుడూ తోడు ఉంటానని రిప్లై ఇచ్చింది. ఐతే సదరు స్టార్ సింగర్ ఎవరో  మాత్రం వీరిద్దరూ బయటపెట్టలేదు. మరి ఈ విషయం ఎంత వరకూ వెళుతోందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?