నానిపై విమర్శలు.. ఎమోషనల్ అవుతూనే ఏకిపారేసిన శివ నిర్వాణ, డోర్ దగ్గర నిల్చుని..

By telugu teamFirst Published Sep 1, 2021, 7:43 PM IST
Highlights

నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ చిత్రం సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. నేడు చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 

నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ చిత్రం సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. నేడు చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. టక్ జగదీష్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నాని మరోసారి ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. 

ఇక ఈవెంట్ లో చిత్ర దర్శకుడు శివ నిర్వాణ తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టక్ జగదీశ్ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయడంపై చాలా విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఎగ్జిబిటర్లు నాని పిరికి వాడు అంటూ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై శివ నిర్వాణ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 

టక్ జగదీష్ చిత్రాన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఎంతగానో ప్రయత్నించాం అని అన్నారు. కానీ కుదర్లేదు. చివరకు సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసి నష్టం వస్తే మా ఇద్దరి రెమ్యునరేషన్స్ తగ్గించుకోమని కూడా చెప్పాం. కానీ ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులని బట్టి ఫ్యామిలీ మొత్తం థియేటర్స్ కి వచ్చే పరిస్థితి లేదు. 

ఇక తప్పని పరిస్థితుల్లో ఓటిటిలో రిలీజ్ చేస్తున్నాం. సినిమా షూట్ జరిగేటప్పుడు.. క్లైమాక్స్ సీన్ కి థియేటర్స్ లో ఇలా ఉంటుంది.. ఇంటర్వెల్ సీన్ కి ఇలా ఉంటుంది అని ప్రత్ రోజు నేను, నాని మాట్లాడుకునేవాళ్ళం. ఐమాక్స్ లో నాని తన ప్రతి చిత్రాన్ని డోర్ వద్ద నిలబడి చూస్తాడు. ఈ సంగతి ఎంతమందికి తెలుసు ? నానిగారు ఎందుకు డోర్ వద్ద నిలబడ్డారు అని అడిగితే.. ఆడియన్స్ రెస్పాన్స్ చూడాలి అని అంటారు. థియేటర్స్ లో సినిమా అంటే నానికి అంత ఇష్టం. 

అలాంటి వ్యక్తిని విమర్శించారు అని శివ నిర్వాణ ఎమోషనల్ అయ్యారు. ఏది ఏమైనా టక్ జగదీష్ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరువవుతోంది. వినాయక చవితి రోజు అదిరిపోతుంది అని శివ నిర్వాణ అన్నారు. 

click me!