టాలీవుడ్ స్టార్స్ అలాంటి వారు... ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లపై కాజల్ కామెంట్స్!

Published : May 21, 2024, 01:14 AM IST
టాలీవుడ్ స్టార్స్ అలాంటి వారు... ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లపై కాజల్ కామెంట్స్!

సారాంశం

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ స్టార్స్ ఎలాంటి వారో వెల్లడించింది. టాప్ స్టార్స్ లో ఎవరినీ వదలకుండా ఒక్కొక్కరి గురించి చెప్పింది. కాజల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

కాజల్ అగర్వాల్ పరిశ్రమకు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా ఆమెకు ఫేమ్ తగ్గలేదు. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. గత ఏడాది బాలయ్యకు జంటగా భగవంత్ కేసరి చిత్రం చేసింది. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆమె లేటెస్ట్ మూవీ సత్యభామ. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజల్ ఏసీపీ రోల్ చేస్తుంది. పోలీస్ అధికారిణిగా ఆమె రౌడీలకు చుక్కలు చూపించనుంది. కాజల్ అగర్వాల్ సత్యభామ మూవీలో చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటుందట. 

సత్యభామ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేస్తున్నారు. సత్యభామ చిత్రం మే 31న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆమె విరివిగా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఆమె ప్రధాన పాత్ర చేసిన నేపథ్యంలో ప్రమోషన్స్ బాధ్యత ఆమెనే తీసుకున్నారు. కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

కాగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి గురించి తన అభిప్రాయం చెప్పాలని కాజల్ ని అడగడం జరిగింది. ప్రభాస్ గురించి మాట్లాడుతూ... ఆయన గ్లోబల్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు. మన సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాడు, అని చెప్పింది. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా టాలెంటెడ్ అని కాజల్ అన్నారు. రామ్ చరణ్ ఆల్ రౌండర్, ఆయన ప్రతి సినిమాకు ఎదుగుతూ వెళుతున్నాడు అని కాజల్ అభిప్రాయ పడింది. మహేష్ బాబు గురించి చెప్పాలంటే చార్మింగ్ పర్సనాలిటీ అని కాజల్ అన్నారు. 

అల్లు అర్జున్ గురించి అడగ్గా... ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటిస్తాడు. ఆయన నటించిన పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాని కాజల్ అన్నారు. ఇక చిరంజీవి కంప్లీట్ ప్యాకేజ్. ఆయనతో నటించే అదృష్టం రావడం నా అదృష్టం అని కాజల్ అన్నారు. బాలయ్య గురించి చెప్పాలంటే ఫన్నీగా ఉంటారని కాజల్ అభిప్రాయ పడింది. పైన చెప్పిన ప్రతి ఒక్కరితో కాజల్ నటించడం విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌