ముప్పై ఏళ్ల సుధీర్ఘ జర్నీ.. ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిన షారూఖ్‌ ఖాన్‌..

Published : Jun 25, 2022, 04:33 PM ISTUpdated : Jun 25, 2022, 05:48 PM IST
ముప్పై ఏళ్ల సుధీర్ఘ జర్నీ.. ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిన షారూఖ్‌ ఖాన్‌..

సారాంశం

షారూఖ్‌ఖాన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 30ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అభిమానులకు బిగ్‌ ట్రీట్‌ ఇచ్చారు షారూఖ్‌ఖాన్‌. 

షారూఖ్‌ ఖాన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా తన ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన కొత్త సినిమా ఫస్ట్ లున్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన `పఠాన్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ మోషన్ పోస్టర్‌ని  విడుదల చేశారు. ఇందులో మాస్‌ లుక్‌లో అదరగొడుతున్నారు షారూఖ్. బేడీలున్న చేతిలో గన్‌ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఉన్నారు షారూఖ్‌. ఆవేశంతో కనిపిస్తున్నారు. ఆయన ఫేస్‌లో రక్తపు మరకలున్నాయి. 

పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తుండగా, దీపికా పదుకొనె కథానాయికగా నటిస్తుంది. జాన్‌ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేడీని ప్రకటించారు. జనవరి 25న సినిమాని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు పెద్ద సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో `పఠాన్‌`ని కూడా హిందీతోపాటు తెలుగు, తమిళంలో మూడు భాషల్లో విడుదల చేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే షారూఖ్‌ ఖాన్‌ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటి(జూన్‌ 25)తో 30ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్‌లో కింగ్‌ ఖాన్‌గా తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన 1992,జూన్‌ 25న `దీవానా` చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించడంతో షారూఖ్‌ బాలీవుడ్‌లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ కాలంలోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. 

మరోవైపు ఒక్కో సినిమాతో తన ఇమేజ్‌ని పెంచుకుంటూ వస్తోన్న ఆయన రొమాంటిక్‌ లవ్‌ `దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే` చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో షారూఖ్‌, కాజోల్‌ జంటగా నటించారు. ఈ సినిమా ముంబయిలోని మరాఠ థియేటర్‌లో ఏకంగా 12ఏళ్లపాటు ప్రదర్శించబడి రికార్డ్ సృష్టించింది.  

ముప్పై ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు షారూఖ్‌. ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. `జీరో` చిత్రం తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న షారూఖ్‌ మళ్లీ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో రాబోతున్నారు. `పఠాన్‌` చిత్రంతోపాటు అట్లీ దర్శకత్వంలో 'జవాన్‌' సినిమా చేస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించనుంది. రాజ్‌ కుమార్ హిరాణీ తెరకెక్కించే 'డంకీ'లోనూ నటించనున్నాడు. ఇవే కాకుండా మాధవన్‌ 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్‌', అమీర్‌ ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చద్ధా', రణ్‌బీర్‌ కపూర్‌ 'బ్రహ్మాస్త్ర', సల్మాన్ ఖాన్‌ 'టైగర్‌-3' చిత్రాల్లో షారూఖ్‌ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?