నీకు ఏ గిఫ్ట్ ఇచ్చినా సరిపోదుః భార్య ఉపాసనకి రామ్‌చరణ్‌ స్పెషల్‌ బర్త్ డే విషెస్‌..

By Aithagoni RajuFirst Published Jul 20, 2021, 11:05 AM IST
Highlights

భార్య ఉపాసనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు రామ్‌చరణ్‌. ఈ సందర్భంగా ఉపాసనతో కలిసి దిగిన ఓ బ్యూటిఫుల్‌ ఫోటోని పంచుకున్నారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ రామ్‌చరణ్‌ తన భార్య ఉపాసనకి బర్త్ డే విషెస్‌ తెలిపారు. `అవసరమైన వారికి, మీ కుటుంబానికి బెస్ట్ ఇవ్వడం ఎప్పుడూ ఆపలేదు. నీవు చేస్తున్నదానికి బహుమతి ఇచ్చేందుకు ఏ గిఫ్ట్ సరిపోదు` అంటూ థ్యాంక్స్ చెబుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు రామ్‌చరణ్‌. ఈ సందర్భంగా ఉపాసనతో కలిసి దిగిన ఓ బ్యూటిఫుల్‌ ఫోటోని పంచుకున్నారు. వీరిద్దరి అనోన్యమైన దాంపత్యాన్ని ప్రతిబింబించేలా ఉందీ ఫోటో. 

. You have never stopped giving ur best to people in need and ur family!!
No gift could ever be enough to thank you!!
HAPPY BIRTHDAY!! 🥳❤️🎂 pic.twitter.com/3V9GlzulI1

— Ram Charan (@AlwaysRamCharan)

ఇదిలా ఉంటే అపోలో లైఫ్‌ ఆసుపత్రి వైస్‌ ఛైర్మెన్‌గా, బి పాజిటివ్‌ మేగజీన్‌ ఎడిటర్‌గా రాణిస్తున్న ఉపాసన 2012లో మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్‌ని పెళ్లి చేసుకుంది. అంతకు ముందే వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నట్టు టాక్‌. గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. ఓ వైపు వ్యాపారవేత్తగా, మరోవైపు మెగా ఫ్యామిలీ ఇల్లాలుగా, మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ అన్నింట తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది ఉపాసన. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరో హీరో. దీంతోపాటు తండ్రి చిరంజీవితో కలిసి `ఆచార్య` చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్నారు. అలాగే స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. 

click me!