అభిమానులకు షాకిచ్చిన రామ్ చరణ్.. మంచి నిర్ణయమే!

By Surya PrakashFirst Published Mar 18, 2020, 12:12 PM IST
Highlights

 చరణ్ తన అభిమానలకు ఓ లేఖ రాశాడు. ఈనెల 27న తన పుట్టిన రోజు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఈ సందర్భంగా వారిని కోరాడు.


మార్చి 27 అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండగ రోజు.  ఆ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఎక్కడ చూసినా ఘనంగా జరుగుతూంటాయి. చాలా చోట్ల పూజలు, కేక్ లు కట్ చేయటాలు వంటివి చేస్తారు. ఈ సమయంలో ఫ్యాన్స్ అందరూ ఓ చోట గుమిగూడి రచ్చ రచ్చ చేస్తూంటారు. అయితే ఈ సారి అలాంటి వేడకలు వద్దు అంటున్నారు రామ్ చరణ్. తన అభిమానులను పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవద్దని ఆయన పిలుపు ఇఛ్చారు. అందుకు కారణం వేగంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ కావటమే.

ఈ నేపథ్యంలో చరణ్ తన అభిమానలకు ఓ లేఖ రాశాడు. ఈనెల 27న తన పుట్టిన రోజు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఈ సందర్భంగా వారిని కోరాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తన లేఖలో చెప్పుకొచ్చారు.

జనసాంద్రత ఎక్కువగా ఉండడం కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ గుంపులుగా చేరి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని చరణ్ తన అభిమానులను కోరాడు. అభిమానులుగా ఈ వ్యాధిలో చిక్కుకున్న వారికి సేవ చేసి.. ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించే ఆరోగ్యంగా ఉండడంమే ఈ సంవత్సరానికి మీరిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అని ఆయన తన అభిమానులకు విన్నవించుకున్నాడు.

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌‌తో పాటు ఎన్టీఆర్‌‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరంభీమ్ గా కనిపించనున్నారు.  

click me!