పోర్న్ కేసులో నన్ను బలి పశువుని చేశారు, కోర్ట్ లో రాజ్ కుంద్రా వాదనలు

By Mahesh JujjuriFirst Published Aug 25, 2022, 3:40 PM IST
Highlights

నాకు ఏ పాపం తెలియదు.. నేను మంచివాడిని.. నన్ను ఈ విషయంలో బలిపశువునుచేశారు.. నాకు ఈ విషయంలో ఎటువంటి సంబంధంలేదు.. బాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త రాజు కుంద్రా కోర్డ్ లో వాదించిన విషయాలు ఇవి. ఇంతకీ రాజ్ కుంద్రా ఇంకేమన్నారు. 

ఫోర్నో గ్రాఫీ కేసు మెడకు చుట్టుకుని ఇబ్బంది పడుతున్నాడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ రాజ్ కుంద్రా. ఆ కేసు నుంచి బయట పడే  ఏ అవకాశాన్ని తాను వదులుకోవడంలేదు. తను అమాయకుడని, తనకు ఏ పాపం తెలియదని. అన్యాయంగా తనను ఇరికించారని వాదిస్తున్నాడు రాజ్ కుంద్రా. ఇప్పటి వరకూ తనపై ఉన్న ఎటువంటి ఆరోపణ నిరూపితం చేయలేకపోయారని. అందుకే ఈ కేసుల నుంచి విముక్తి ఇవ్వాలని కోరుకున్నారు. 

పోర్నోగ్రఫీ కేసులో తనకు ఏ పాత్ర లేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు...బాలీవుడ్ స్టార్ బ్యూటీ..  శిల్పాశెట్టి భర్త.. ప్రముఖ వ్యాపారి, నిర్మాత  రాజ్ కుంద్రా. ఇండస్ట్రీలోకి రావాలని.. హీరోయిన్ లు గా ఎదగాలని ఎంతో మంది యువత నటన కోసం ముంబయ్ వస్తుంటారు. అలాంటి యువతులను మాయమాటలు చెప్పి  పోర్న్ వీడియోలు  చేస్తూ భారీ ఎత్తును చీకటి  వ్యాపారం చేస్తున్నారంటూ.. రాజ్ కుంద్రా   ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ  విషయంలో ఆయన మరోసారి కోర్ట్ ను ఆశ్రయించారు. తనపై పెట్టిన ఈ నిరాదార కేసును  కొట్టి వేయాలని కోరుతూ ఆయన మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. 

 ఎవరో తెలియని వారి నుంచి వచ్చిన ఫిర్యాదును తీసుకుని.. ఆ కంప్లైట్  ఆధారంగా ఇప్పటి వరకుదర్యాప్తును చేశారని కాని తాను  ఎటువంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనలేదని, రహస్యంగా ఎటువంటి కంటెంట్ ను సృష్టించలేదని అడ్వొకేట్ ప్రశాంత్ పాటిల్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్ లో రాజ్ కుంద్రా పేర్కొన్నారు. తనను బలిపశువును చేసి.. ఇరికించారని, తనపై నిరాధార ఆరోపణలు చేశారని.. తను  ఎటువంటి కంటెంట్ అప్ లోడ్ చేయలేదు.. ప్రసారం చేసే కార్యకలాపాల్లో పాల్గొనలేదని కోర్టుకు తెలిపాడు. 

చార్జ్ షీటులో కానీ, సప్లిమెంటరీ చార్జ్ షీటులోకానీ ఏ ఒక్క  లేడీ కూడా తనను కుంద్రా బెదిరించినట్టు, బలవంతం పెట్టినట్టు, వీడియో తీసినట్టు చెప్పలేదని కోర్ట్ కు  గుర్తు చేశారు. పోర్న్ కంటెంట్ అప్ లోడ్ చేయడం.. లేదా తానే స్వయంగా అప్ లోడ్ చేయడం లాంటి వాటిలో.. తాను  పాల్గొనలేదని నివేదించారు. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ మెటీరియల్ పంపిణీ కోసం హాట్ షాట్స్ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీటు పేర్కొంది. దీన్ని రాజ్ కుంద్రా ఖండించారు. దర్యాప్తు సంస్థ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని సంపాదించలేకపోయిందని అంటున్నారు. 

click me!