Latest Videos

కల్కి మూవీ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్... ఇది సరిపోదు ప్రభాస్, ఇంకా గట్టిగా కొట్టాలి!

By Sambi ReddyFirst Published Jun 30, 2024, 4:40 PM IST
Highlights


కల్కి 2829 AD మూవీ వరల్డ్ వైడ్ వసూళ్లు కుమ్మేస్తుంది. కాగా ట్రేడ్ వర్గాలు ఏరియా వైజ్ ఫిగర్స్ విడుదల చేశాయి. కల్కి మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల రీత్యా మరింత రాబట్టాల్సి ఉంది. కల్కి 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.. 
 

కల్కి 2829 AD మూవీ వరల్డ్ వైడ్ వసూళ్లు కుమ్మేస్తుంది. కాగా ట్రేడ్ వర్గాలు ఏరియా వైజ్ ఫిగర్స్ విడుదల చేశాయి. కల్కి మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల రీత్యా మరింత రాబట్టాల్సి ఉంది. కల్కి 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.. 

కల్కి 2829 AD తో ప్రభాస్ క్లీన్ హిట్ అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కల్కి చిత్రం పై మొదటి నుండి హైప్ ఉంది. మైథాలజీ-సైన్స్ ఫిక్షన్ మూవీ ఏమిటనే క్యూరియాసిటీ జనాల్లో ఏర్పడింది. ట్రైలర్స్ ఒకింత ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ సైతం వినూత్నంగా నిర్వహించారు. జూన్ 27న వరల్డ్ వైడ్ కల్కి విడుదల చేశారు. యూఎస్ ప్రీమియర్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. విజువల్స్ అబ్బురపరిచయాని, కల్కి చివరి 30 నిమిషాలు గొప్పగా సాగిందని ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. 

కల్కి చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖులతో పాటు విమర్శకులు కూడా ప్రసంశించారు. ఈ క్రమంలో కల్కి చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. ముఖ్యంగా యూఎస్ లో కల్కి మూవీకి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్వాలేదు. తమిళనాడు, కేరళలో మాత్రం వసూళ్లు నిరాశాజనకంగా ఉన్నాయి. లాంగ్ వీకెండ్ తో విడుదలైన కల్కి మూడు రోజుల్లో బాగానే రాబట్టింది. అయితే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన నేపథ్యంలో ఇంకా సత్తా చాటాల్సి ఉంది. 

నైజాంలో కల్కి మూడు రోజులకు కల్కి రూ. 40.75 కోట్ల షేర్ వసూలు చేసింది. సీడెడ్ రూ. 9.82 కోట్లు వసూలు చేసింది.  ఏపీ/తెలంగాణాలలో కల్కి మూడు రోజులకు రూ. 132.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ. 84.69 కోట్ల షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ కల్కి మూవీ 3 డేస్ గ్రాస్ రూ. 380.7 కోట్లు,   షేర్ రూ. 198.04 కోట్లు. కల్కి చిత్రం వరల్డ్ వైడ్ రూ. 375 కోట్ల షేర్ రాబట్టినచో బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది. లాభాల్లోకి రావాలంటే కల్కి మరో రూ. 177 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.  

కల్కి చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు చేశారు. శోభన, రాజేంద్రప్రసాద్, దిశా పటాని, పశుపతి ఇతర కీలక రోల్స్ లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా అశ్వినీ దత్ నిర్మించారు. 

ఏరియా వైజ్ కల్కి మూవీ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్(జీఎస్టీ తో కలిపి).. 

నైజాం - 40.75 కోట్లు

రాయలసీమ - 09.82 కోట్లు

నెల్లూరు - 02.88 కోట్లు

గుంటూరు - 05.56 కోట్లు

కృష్ణ - 05.20 కోట్లు

వెస్ట్ - 04.44 కోట్లు

తూర్పు - 06.19 కోట్లు

ఉత్తరాంధ్ర - 09.85 కోట్లు

ఫిక్స్డ్ హైర్స్ - 01.70 కోట్లు


ఏపీ/తెలంగాణాల్లో  3 రోజులకు
మొత్తం థియేట్రికల్ గ్రాస్ - 132.30 కోట్లు

తెలుగు రాష్ట్రాలు 3 రోజులకు
 మొత్తం థియేట్రికల్ షేర్ - 84.69cr

కర్ణాటక - 12.40 కోట్లు

కేరళ - 04.00 కోట్లు

తమిళనాడు - 06.85 కోట్లు

హిందీ + మిగిలిన భారతదేశం - 37.90cr

ఓవర్సీస్ - 52.20 కోట్లు
(అన్ని భాషలు)

ప్రపంచవ్యాప్త 3 రోజులకు
మొత్తం థియేట్రికల్ గ్రాస్ - 380.70 కోట్లు

ప్రపంచవ్యాప్త 3 రోజులకు
మొత్తం థియేట్రికల్ షేర్ - 198.04cr

ప్రపంచవ్యాప్త థియేట్రికల్ షేర్ బ్రేక్ ఈవెన్ - 375.00cr

click me!