రెండు సినిమాలు ఆగిపోవడంతో స్టార్‌ డైరెక్టర్‌కి కమిట్‌ అయిన నాని..? ఫస్ట్ టైమ్‌..

Published : Jul 02, 2024, 09:45 AM IST
రెండు సినిమాలు ఆగిపోవడంతో స్టార్‌ డైరెక్టర్‌కి కమిట్‌ అయిన నాని..? ఫస్ట్ టైమ్‌..

సారాంశం

నేచురల్‌ స్టార్‌ నాని సినిమాలకు బ్రేకులు పడుతుండటం ఆశ్చర్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన మరో కొత్త మూవీకి ఓకే చెప్పారట. ఈ సారి స్టార్‌ డైరెక్టర్‌తో కలిసి చేస్తున్నారు   

నేచురల్‌ స్టార్‌ నానికి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు పడ్డాయి. `దసరా`తో వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. రా, రస్టిక్‌ కథతో తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన `దసరా` పెద్దవిజయం సాధించింది. నానిలోని కొత్త యాంగిలని ఆవిష్కరించింది. మాస్‌ ఎలిమెంట్లని పరిచయం చేసింది. నాని మార్కెట్‌ రేంజ్‌ని చూపించింది. ఈ మూవీ ఏపీలో పెద్దగా ఆడలేదు. అయినా వంద కోట్ల గ్రాస్‌ వసూలుచేయడం మామూలు విషయం కాదు. దీనికి శ్రీకాంత్‌ ఓడెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించడం విశేషం.

అనంతరం `హాయ్‌ నాన్న`తో వచ్చాడు నాని. ఈ మూవీకి కూడా కొత్త దర్శకుడే. ఈ సినిమాకి డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయినా కూడా 70-80కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్టు టాక్‌. ఈ నేపథ్యంలో నాని కోసం దర్శకులు క్యూ కట్టారు. ప్రస్తుతం ఆయన `సరిపోదా శనివారం` చిత్రంలో నటిస్తున్నారు. వివేక ఆత్రేయ దర్శకుడు. దీంతోపాటు `దసరా` దర్శకుడితోనే ఓ సినిమా ఉంది. అలాగే సుజీత్‌తో ఓ మాఫియా బేస్డ్ సినిమాని ప్రకటించారు. `బలగం` వేణుతో మరో సినిమా అనుకున్నారు. `హిట్‌ 3` సిరీస్‌ ఉంది. ఇలా నాలుగైదు ప్రాజెక్ట్ లతో నాని బిజీ అయిపోయారు. 

కానీ ఇందులో రెండు సినిమాలు ఆగిపోయాయి. సుజీత్‌తో సినిమా బడ్జెట్ కారణంగా ఆగిపోయింది. సినిమాకి నాని మార్కెట్‌కి మించిన బడ్జెట్‌ కావడం, అలాగే నాని పారితోషికం ఎక్కువ డిమాండ్‌ చేయడంతో నిర్మాత డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారట. మరోవైపు స్క్రిప్ట్ విషయంలో బలగం వేణు సినిమాని కూడా పక్కన పెట్టారట. మంచి కథ దొరికితే ఈ సినిమా ఉండేలా ఉంది. ప్రస్తుతానికైతే ఈ కాంబినేషన్‌ లేదని అంటున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు నాని. ఈ సారి స్టార్‌ డైరెక్టర్‌తో సినిమాకి కమిట్‌ అయ్యాడు. టాలీవుడ్‌ సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శేఖర్‌ కమ్ముల. ఆయన ఇటీవల నానికి ఓ లైన్‌ చెప్పారట. నానికి బాగా నచ్చి, వెంటనే ఓకే చెప్పారని తెలుస్తుంది. దీనికి ఏషియన్‌ సునీల్‌ నిర్మించే ఛాన్స్ ఉంది. నాని, శేఖర్‌ కమ్ములతో సినిమా ఫస్ట్ టైమ్‌. దీంతో ఈ కాంబినేషన్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇదొక కొత్త తరహా మూవీ అవుతుందని చెప్పొచ్చు 

ఇక ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల `కుబేర` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్‌, నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు. పేదవాడిగా ధనుష్‌, కుబేరుడిగా నాగార్జున నటిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఏషియన్‌ సినిమాస్‌ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్‌ కానుంది. అనంతరం నాని మూవీపై వర్క్ చేయనున్నారు శేఖర్‌ కమ్ముల. మరోవైపు నాని నటిస్తున్న `సరిపోదా శనివారం` సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా