ప్రభాస్ 21 కోసం రంగంలోకి దిగిన దిగ్దర్శకుడు సింగీతం...మూవీ జానర్ అదేనా..?

By Satish ReddyFirst Published Sep 21, 2020, 6:44 PM IST
Highlights

రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేయనున్న భారీ పాన్ ఇండియా మూవీపై విపరీతమైన ఆసక్తి నెలకొని వుంది. 500కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాత ఆశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్ర దర్శకత్వ పర్యవేక్షణ  కొరకు సింగీతం దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుని తీసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం ఆసక్తిరేపుతుంది.

ప్రభాస్ 21 చిత్ర దర్శకత్వ పర్యవేక్షణ కోసం దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ఆయనను తమ ఎపిక్ చిత్రంలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ఎంతగానో థ్రిల్ అవుతున్నట్లు, ఆయన అద్భుత సృజన మాకు మంచి ప్రేరణ అవుతుందని భావిస్తున్నాం అన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్ర దర్శకత్వ పర్యవేక్షణ కోసం సింగీతం గారిని తీసుకోనున్నారని ఇప్పటికే కథనాలు రావడం జరిగింది. అయితే దీనిపై నేడు అధికారిక ప్రకటన చిత్ర యూనిట్ విడుదల చేశారు. 

సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ దాదాపు 500కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ మూవీ జోనర్ పై టాలీవుడ్ లో అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఇది సోసియో ఫాంటసీ మూవీ అని, జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ అని కథనాలు వచ్చాయి. 

సడన్ గా సింగీతం శ్రీనివాసరావు గారిని రంగంలోకి దింపడంతో ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అయ్యే అవకాశం కలదని అంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే 1991 లో ఆదిత్య 369 అనే సైన్స్ మూవీ సింగీతం తెరకెక్కించారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకులకు సింగీతం గొప్ప అనుభూతి పంచారు. ప్రభాస్ 21 మూవీ కూడా సైన్స్ ఫిక్షన్ మూవీ నేపథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ పర్యవేక్షణ కోసం తీసుకున్నారనిపిస్తుంది. 
 

A long awaited dream finally comes true. We are thrilled to welcome Garu to our epic.
His creative superpowers will surely be a guiding force for us. pic.twitter.com/Mxvbs2s7R9

— Vyjayanthi Movies (@VyjayanthiFilms)
click me!