Pawan mahesh in Samantha Item Song: సమంత ఐటెమ్ సాంగ్‌కి స్టెప్పేసిన పవన్‌ మహేష్‌ ప్రభాస్‌‌.. వీడియో వైరల్‌..

Published : Dec 16, 2021, 06:09 PM ISTUpdated : Dec 16, 2021, 06:19 PM IST
Pawan mahesh in Samantha Item Song: సమంత ఐటెమ్ సాంగ్‌కి స్టెప్పేసిన పవన్‌ మహేష్‌ ప్రభాస్‌‌.. వీడియో వైరల్‌..

సారాంశం

సమంత ఐటెమ్‌ సాంగ్‌కి అల్లు అర్జున్‌ స్టెప్పేయడం సాధారణమే. కానీ పవన్‌ డాన్సు చేయడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇంతకి ఆ కథేంటో చూస్తే.. 

సమంత(Samantha) నటించిన ఐటెమ్‌ సాంగ్‌ ఇప్పుడు ఉర్రూతలూగిస్తుంది. `పుష్ప`(Pushpa) చిత్రంలో ఆమె నటించిన `ఊ అంటవా.. ఉ ఉ అంటవా` అంటూ సాగే ఐటెమ్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇప్పటికే ఈ పాటకి 40 మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. ఈ పాటకి అనేక మంది మీమ్స్ చేస్తూ, పాటకి డాన్సులు చేస్తూ తీసిన వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. దీంతో సమంత ఐటెమ్‌ సాంగ్‌ దుమ్ముదుమారంరేపుతుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఐటెమ్‌ సాంగ్‌కి పవన్‌ కళ్యాణ్‌ స్టెప్పులేయడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆ వీడియో వైరల్‌ అవుతుంది. 

Samantha Item Songకి అల్లు అర్జున్‌ స్టెప్పేయడం సాధారణమే. కానీ పవన్‌ డాన్సు చేయడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇంతకి ఆ కథేంటో చూస్తే.. సమంత నటించిన `ఊ అంటవా.. ఉఉ అంటవా` అనే పాటకి పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోని డాన్సులను మిక్స్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.  పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) నటించిన `బద్రి`, `ఖుషి`, `అత్తారింటికి దారేది` సినిమాల్లోని పాటలకు మిక్స్ చేశారు. అంతేకాదు ప్రభాస్‌(Prabhas), మహేష్‌బాబు(Maheshbabu), అల్లు అర్జున్‌, చిరంజీవి ఇలా వారి సినిమాల్లోని పాటల క్లిప్పులను మేల్‌ వర్షెన్‌లో మిక్స్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ పాట మరింతగా ఆకట్టుకుంటుంది. 

ఈ పోస్ట్ ని, ఆ వీడియోని అభిమానులు, నెటిజన్లు షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో సమంత ఐటెమ్‌ సాంగ్‌ ఇప్పుడు మరింతగా ట్రెండ్‌ అవుతుంది. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌, చిరంజీవి అభిమానులు సైతం దాన్ని షేర్‌ చేస్తుండటంతో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుందీ సాంగ్‌. మేల్‌ వర్షెన్‌లో మరింత హాట్‌గా ఉండటంతో కుర్రాళ్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. సమంత.. పవన్‌ కళ్యాణ్‌తో `అత్తారింటికి దారేదీ`, మహేష్‌ తో `దూకుడు` చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్‌తో `సన్నాఫ్‌ సత్యమూర్తి` సినిమాలో నటించింది. 

సమంత ఐటెమ్‌ సాంగ్‌తో సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల ఓ రకంగా సెకండ్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా ముందుకు సాగుతుంది. ఓ వైపు టాలీవుడ్‌ నుంచి పాన్‌ ఇండియా సినిమాలు చేస్తుంది. మరోవైపు ఓ ఇంటర్నేషనల్‌ సినిమాకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు ఫస్ట్ టైమ్‌ `పుష్ప`లో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. దీంతోపాటు హాట్‌ ఫోటో షూట్లతో కుర్రాళ్ల మతిపోగొడుతూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది సమంత. ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

also read: నేను కూడా కేసు పెడతా, మహిళల పరువు పోయింది.. సమంత ఐటెం సాంగ్ పై మాధవీలత షాకింగ్ కామెంట్స్

also read: Samantha cute photos: అన్నం తింటున్నావా? అందం తింటున్నావా?.. సమంత క్యూట్‌నెస్ కి ఎవ్వరైనా పడిపోవాల్సిందే

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి