
టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ టాలెంటెడ్ హీరో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ చూసుకుపోతున్నాడు.
రీసెంట్ గా శ్రీవిష్ణు హీరో గా ‘జోహార్’ ఫేమ్ తేజా మార్ని దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు,. "అర్జున ఫల్గుణ" అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో రూపొందిన ఈమూవీని న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్. ఈ సినిమాలో..శ్రీ విష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్,సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈమూవీ నుంచి మూడు పాటలు రిలీజ్ అవ్వగా అందులో ‘గోదారి వాళ్ళే సందమామా’ సాంగ్ బాగా ఆకట్టుకుంది. దీనితో పాటు టీజర్ లో డైలాగ్స్ కూడా అదరగొట్టారు మేకర్స్.
Also Read : నేను కూడా కేసు పెడతా, మహిళల పరువు పోయింది.. సమంత ఐటెం సాంగ్ పై మాధవీలత షాకింగ్ కామెంట్స్
ఈ సినిమాలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. టీజర్ డైలాగ్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. బలైపోడానికి నేను అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని.. అంటూ హీరో చెప్పిన డైలాగ్ గట్టిగా పేలింది. ఇక ఈ సినిమాకు కథ – స్క్రీన్ ప్లే దర్శకుడు తేజ మార్ని అందించగా.. సుధీర్ వర్మ డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.