జూ.ఎన్టీఆర్ ని అలా చూడలేకపోయాను.. తప్పు అని చెప్పినా హరికృష్ణ వినలేదు

By telugu teamFirst Published Sep 2, 2021, 7:48 PM IST
Highlights

నందమూరి హరికృష్ణ 65వ జయంతి నేడు. ఎన్టీఆర్ వారసుడిగా అటు రాజకీయాల్లో, సినిమాల్లో హరికృష్ణ తనదైన ముద్ర వేశారు. 2018 ఆగష్టు 29న హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

నందమూరి హరికృష్ణ 65వ జయంతి నేడు. ఎన్టీఆర్ వారసుడిగా అటు రాజకీయాల్లో, సినిమాల్లో హరికృష్ణ తనదైన ముద్ర వేశారు. 2018 ఆగష్టు 29న హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ముక్కుసూటిగా వ్యవహరించే హరికృష్ణ మనసు చాలా మంచిది అని సన్నహితులు చెబుతుంటారు. 

ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నారు. నందమూరి కుటుంబంలో తనకు మొదట పరిచయం అయిన వ్యక్తి హరికృష్ణ అని పరుచూరి అన్నారు. అలాంటి హరికృష్ణ లేడు అనే మాటని కూడా తాను తట్టుకోలేను అని పరుచూరి అన్నారు. 

అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను జూ. ఎన్టీఆర్ ని అలా చూడలేక పోయానని పరుచూరి అన్నారు. ఓ వైపు తండ్రి జ్ఞాపకాలు వెంటాడుతుంటే.. ఆ చిత్ర కథ కూడా అలాగే ఉంటుంది. దీనితో ఎన్టీఆర్ ని అంత విషాదంతో చూడలేకపోయానని పరుచూరి అన్నారు. 

హరికృష్ణ నన్ను ఎప్పుడూ పగో(పరుచూరి గోపాల కృష్ణ) అనే పిలిచేవాడు. ఒకరోజు మనస్తాపంతో నన్ను పిలిచి.. సొంతంగా పార్టీ పెట్టాలనుకుంటున్నాను.. నీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. తప్పుబాబు.. ఇది మీ నాన్నగారు పెట్టిన పార్టీ.. నువ్వు ఇందులోనే ఉండాలి అని చెప్పాను. కానీ వినలేదు. ఆ తర్వాత రియలైజై మళ్ళీ వచ్చారు. 

ఒకసారి హరికృష్ణ విజయవాడ నుంచి తన తండ్రి వద్దకు కేవలం గంట ముప్పై నిమిషాలలోనే కారు డ్రైవ్ చేశాడు. కానీ ఆ వేగమే ఆయన ప్రాణాలు తీస్తుందని అప్పుడు ఊహించలేదు అని పరుచూరి అన్నారు. 

click me!