బిగ్ బాస్ షోపై నెటిజన్లు ట్రోలింగ్!

Published : Sep 08, 2018, 02:44 PM ISTUpdated : Sep 09, 2018, 01:29 PM IST
బిగ్ బాస్ షోపై నెటిజన్లు ట్రోలింగ్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్2 ముగింపు దశకు చేరుకునే కొద్దీ షోపై ఆసక్తి మరింత పెంచే విధంగా బిగ్ బాస్ టాస్క్ లను ఇస్తున్నారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కి టికెట్ టు ఫినాలే టాస్ ఇచ్చారు. 

బిగ్ బాస్ సీజన్2 ముగింపు దశకు చేరుకునే కొద్దీ షోపై ఆసక్తి మరింత పెంచే విధంగా బిగ్ బాస్ టాస్క్ లను ఇస్తున్నారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కి టికెట్ టు ఫినాలే టాస్ ఇచ్చారు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న కారులో ఐదుగురు ఇంటి సభ్యులు 24 గంటల పాటు కూర్చోవాలి. బజర్ మోగే సమయానికి ఒకరు మాత్రమే కారులో ఉండాలి. ఆ ఒక్క కంటెస్టెంట్స్ నేరుగా ఫైనల్స్ కి వెళ్తారు.

ఈ క్రమంలో తనీష్, దీప్తి, శ్యామల, సామ్రాట్, గీతా మాధురిలు కారులో కూర్చోగా.. గీతా కారులో పడుకోవడంతో ఆమె టాస్క్ నుండి వైదొలగింది. చివరకు కారులో ఒక్కరే ఉండాలనే కారణంతో తనీష్, సామ్రాట్ లు శ్యామల, దీప్తిలపై బలప్రయోగం చేశారు. శ్యామల హర్ట్ అవుతుందని చెప్పడంతో సామ్రాట్ ఆమెను నెట్టడం ఆపేశాడు. కానీ తనీష్ మాత్రం దీప్తిపై తన బలం ప్రయోగిస్తునే ఉన్నాడు.

ఈ క్రమంలో ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెను ఇష్టమొచ్చినట్లుగా పట్టుకొని అత్యంత క్రూరంగా బయటకి పంపే ప్రయత్నం చేశాడు. ఆమెపై మ్యాన్ హ్యాన్డ్లింగ్ కూడా చేశాడు. కానీ దీప్తి అతడిని ఎదిరించి కారులోనే ఉండిపోయారు. దీప్తి పట్ల తనీష్ ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పైగా అతడు కారులో మహిళల ముందే మూత్రం పోయడానికి కూడా వెనుకాడకపోవడంతో హౌస్ లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువవుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.  

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: కౌశల్ భార్యకి దండం పెట్టాలి.. దీప్తి షాకింగ్ కామెంట్స్! 

గీతాని తిడుతూ వీడియో.. నాని ఘాటు రిప్లై!

బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ అసహనం!

బిగ్ బాస్2: మీ ఇంప్రెషన్ ఎవడికి కావాలి..? గీతాపై కౌశల్ ఫైర్!

బిగ్ బాస్2: కౌశల్.. కావాలని కెలుక్కోకు.. గీతామాధురి వార్నింగ్!

 

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?