హీరోయిన్ ఆరోపణలపై.. నానాపటేకర్ కామెంట్!

Published : Sep 28, 2018, 09:51 AM ISTUpdated : Sep 28, 2018, 09:59 AM IST
హీరోయిన్ ఆరోపణలపై.. నానాపటేకర్ కామెంట్!

సారాంశం

బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ ని టార్గెట్ చేస్తూ ఆయనపై పలు ఆరోపణలు చేసింది. ఆయన మహిళలను లైంగికంగా వేధిస్తాడని.. ఆ విషయం తెలిసినా.. ఎవరూ బయటకి మాట్లాడరని.. తనను కూడా వేధించాడని చెప్పుకొచ్చింది. 

బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ ని టార్గెట్ చేస్తూ ఆయనపై పలు ఆరోపణలు చేసింది. ఆయన మహిళలను లైంగికంగా వేధిస్తాడని.. ఆ విషయం తెలిసినా.. ఎవరూ బయటకి మాట్లాడరని.. తనను కూడా వేధించాడని చెప్పుకొచ్చింది. 2009లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేసింది తనుశ్రీదత్తా.

ఈ విషయంపై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్పందించారు. నానా వ్యక్తిత్వం అలాంటిది కాదని.. ఆయన ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించలేదని అన్నారు. తనుశ్రీ చెబుతోన్న సినిమాకు తనే కొరియోగ్రాఫర్ గా పని చేసినట్లు తనుశ్రీ.. నానాపటేకర్ ని తప్పుగా అర్ధం చేసుకున్నారని వెల్లడించారు.

దీనిపై కూడా తనుశ్రీ కామెంట్ చేస్తూ.. నానాపటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సమయంలో గణేష్ చూశారని.. ఆ సమయంలో ఆయన రెస్పాండ్ అవ్వలేదని వెల్లడించింది. అయితే ఈ విషయాలపై నానాపటేకర్ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓ ఆంగ్ల మీడియా విలేకరితో ఫోన్ లో మాట్లాడిన నానాపటేకర్.. ''ఆ అమ్మాయి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే నన్నేం చేయమంటారు..? సెట్ లో నాతో పాటు వందల మంది ఉన్నారు. ఈ విషయం గురించి నేను ఎంత మాట్లాడినా వృధానే.. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీడియాలో నేనేం మాట్లాడినా.. అవి మరోరకంగా రాస్తుంటారు'' అని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్త.. 
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

PREV
click me!

Recommended Stories

Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?
55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?