దసరా కానుకగా.. ఎన్టీఆర్ 'అరవింద సమేత'!

Published : Sep 27, 2018, 06:09 PM IST
దసరా కానుకగా.. ఎన్టీఆర్ 'అరవింద సమేత'!

సారాంశం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 

అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటివరకు సినిమాలో నాలుగు పాటలను విడుదల చేసిన చిత్రబృందం ప్రస్తుతం ఐదో పాట చిత్రీకరణలో ఉందని సమాచారం.

ఈ పాటను మాత్రం సస్పెన్స్ గా ఉంచబోతున్నారు. ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుండగా.. ఈషా రెబ్బ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. 

PREV
click me!

Recommended Stories

2025లో వీరే తోపు బ్యాటర్లు.. టీమిండియాలో తురుమ్ ఖాన్లు.. లిస్టులో ఎవరున్నారంటే.?
'కమల్‌ హసన్‌తో విడిపోవడం వెనుక అసలు కారణం అదే.. ఆమెకు ఏం తెలియదు.!'