ఇంటికి అమ్మాయిలను తీసుకువచ్చేవాడు.. డైరెక్టర్ పై మాజీ భార్య కామెంట్స్

By ramya neerukondaFirst Published Oct 10, 2018, 4:52 PM IST
Highlights

 నన్ను వదలిపెట్టకండి అని వేడుకున్నాను. కానీ అతను వినలేదు. నేను గర్భం దాల్చాక అబార్షన్‌ చేయించుకోమని టార్చర్‌ పెట్టాడు. అలా రెండు, మూడు సార్లు బిడ్డను పోగొట్టుకోవాల్సి వచ్చింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం నడుస్తోంది. పర పురుషుల కారణంగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి యువతులు ఒక్కొక్కరుగా గళం విప్పి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అయితే.. సొంత కట్టుకున్న భర్తే తనను ముప్పుతిప్పలు పెట్టాడని మీడియా ముందుకు వచ్చింది ఓ డైరెక్టర్ మాజీ భార్య.

పూర్తి వివరాల్లోకి వెళితే.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని బ్లాక్ బస్టర్‌ విజయం సాధించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’. నాగరాజ్‌ మంజులే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హిందీలో ఈ చిత్రం ‘ధడక్‌’ పేరుతో విడుదలై అక్కడా మంచి పేరు తెచ్చుకుంది. సమాజంలో ఆడవారు ఎదుర్కొనే బాధలను వివరిస్తూ మంచి కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు తీసే నాగరాజ్‌ మంజులే గురించి ఆయన మాజీ భార్య సునిత షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు.

‘నాకు 18 ఏళ్లకే నాగరాజ్‌తో పెళ్లైంది. ఆ సమయంలో అతను దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కష్టపడుతుండేవాడు. ఇందుకోసం అతను వేరే నగరానికి వెళ్లి చదువుకునేవాడు. నాగరాజ్‌ కుటుంబంలో నేనే పెద్ద కోడలిని. దాంతో కుటుంబాన్ని నేనే చూసుకునేదాన్ని. మా సంసారంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ తట్టుకున్నాను. ఎందుకంటే నా భర్త పట్ల నాకు ప్రేమ, భక్తి ఉన్నాయి. నేనే కాదు ప్రతి భారతీయ మహిళ కూడా నాలాగే ఆలోచిస్తుంది. రాన్రాను నాగరాజ్‌ ప్రవర్తన మితిమీరింది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు. వారందరికీ నేనే వండిపెట్టేదాన్ని.’

‘ నన్ను వదలిపెట్టకండి అని వేడుకున్నాను. కానీ అతను వినలేదు. నేను గర్భం దాల్చాక అబార్షన్‌ చేయించుకోమని టార్చర్‌ పెట్టాడు. అలా రెండు, మూడు సార్లు బిడ్డను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఒకరోజు నాగరాజ్‌ తెరకెక్కించిన ‘పిస్తుల్యా’ అనే లఘ చిత్రం జాతీయ అవార్డుకు నామినేట్‌ అయిందని తెలిసింది. అది తెలిసి నేను షాకయ్యాను. అవార్డు అందుకోవడానికి అందరూ దిల్లీ వెళ్లారు. నన్ను మాత్రం ఇంట్లోని ఓ గదిలో బంధించారు. ఇక చేసేదేంలేక కొన్ని రోజుల తర్వాత నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాను. 2012లో విడాకులకు దరఖాస్తు చేస్తున్నాం. 2014లో చట్టప్రకారం విడిపోయాం.’ అని వెల్లడించారు సునిత.

read more news

నేను అలా చేసి ఉంటే ఐశ్వర్య బతికుండేదే కాదు.. సల్మాన్ వీడియో వైరల్!

#మీటూ అంటున్న గుత్తా జ్వాలా.. షాకింగ్ కామెంట్స్

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

ఆ నిర్మాత దారుణంగా హింసించాడు.. నటి ఫోటోలు వైరల్!

click me!