అరవింద సమేత కౌంట్ డౌన్ మొదలయ్యింది.. ఫస్ట్ షో టైమింగ్స్!

Published : Oct 10, 2018, 04:18 PM IST
అరవింద సమేత కౌంట్ డౌన్ మొదలయ్యింది.. ఫస్ట్ షో టైమింగ్స్!

సారాంశం

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల పండగ రోజు రావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. 

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల పండగ రోజు రావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. బయ్యర్లు ఇప్పటికే రిలీజ్ సమయానికి సినిమాను ప్రదర్శించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. 

ఇక ఇప్పటికే నందమూరి అభిమానులు వారి స్టైల్ లో థియేటర్స్ నిండా కటవుట్స్, బ్యాన్నర్ లతో నింపేశారు. అసలు విషయంలోకి వస్తే.. సినిమా టైమింగ్స్ అంతా సెట్టయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 5 గంటలకే షోలు స్టార్ట్ అవ్వనున్నాయి. ఇక తెలంగాణాలో మొదటి షో 8 గంటల 45నిమిషాలకు మొదలవ్వనుంది. ఐమ్యాక్స్ లో ఫస్ట్ షో స్టార్ట్ కానుంది. 

ఇక యూఎస్ ప్రీమియర్స్ విషయానికి వస్తే భారత కాలమానం ప్రకారం ఉదయం 2గంటలకు మొదలవ్వనుంది. అంటే అక్కడ సాయంత్రం నాలుగున్నర  గంటలకన్నమాట. యూఎస్ టాక్ ఏంటో మనకు ఉదయం 5 గంటలలోపే లోపే తెలిసిపోతుంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు యూఎస్ టాక్ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?