
సూపర్ స్టార్ మహేష్ బాబు గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు నచ్చిన సినిమాల మీద ట్వీట్ లు చేయడం, స్పోర్ట్స్, సెలబ్రిటీల బర్త్ డేలు ఇలా చాలా విషయాలపై ఆయన ట్వీట్లు చేస్తున్నారు.
ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు' సినిమా చూసిన ఆయన సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాజాగా 'పేటా' సినిమాపై కూడా కామెంట్స్ చేశాడు మహేష్. తనలాంటి రజినీకాంత్ అభిమానులందరికీ 'పేటా' తో మంచి ట్రీట్ ఇచ్చిన తలైవాకి వందనాలు అని రాసుకొచ్చారు.
మనకున్న అద్బుతమైన టాలెంటెడ్ దర్శకుల్లో కార్తిక్ సుబ్బరాజ్ ఒకరని, ఎప్పటిలాగే సినిమాటోగ్రాఫర్ తిరు అధ్బుత పనితనం కనబరిచారని అన్నారు. సినిమా కోసం పని చేసిన యూనిట్ అందరికీ అభినందనలు తెలిపారు.
'పేటా' ప్రీమియర్ షో కలెక్షన్స్!
రజినీకాంత్ మేనియా.. 'పేటా' థియేటర్ బయట పెళ్లి!