షూటింగ్ తర్వాత.. స్క్రిప్టు రీరైట్ చేయండి!

By Udayavani DhuliFirst Published Jan 11, 2019, 12:24 PM IST
Highlights

వరస ఫ్లాఫ్ లు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్న వ్యక్తినైనా కుంగతీస్తాయి. ఆలోచనలో పడేస్తాయి.అనుమానాలకు తెర తీస్తాయి ఇప్పుడు రవితేజ పరిస్దితి అదే. గత కొంతకాలంగా వరస ఫ్లాప్ ల్లో ఉన్న రవితేజ.. ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నారు. 

వరస ఫ్లాఫ్ లు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్న వ్యక్తినైనా కుంగతీస్తాయి. ఆలోచనలో పడేస్తాయి.అనుమానాలకు తెర తీస్తాయి ఇప్పుడు రవితేజ పరిస్దితి అదే. గత కొంతకాలంగా వరస ఫ్లాప్ ల్లో ఉన్న రవితేజ ... ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం డిసెంబర్ లో లాంచ్ అవ్వాల్సింది. కానీ రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. అందుతున్న సమాచారం రవితేజ స్క్రిప్టులో పలు మార్పులు చెప్పటమే అని తెలుస్తోంది. 

'టైగర్', ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, 'ఒక్కక్షణం' వంటి వైవిధ్యభరిత కథాంశాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆనంద్. దీంతో రవితేజతోనూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ప్లాన్ చేసాడ. అయితే రవితేజ తాని రిస్క్ తీసుకోదలుచుకోలేదని, ప్రయోగాలు వద్దని చెప్పి, స్క్రిప్టు రీరైట్ చేయిస్తున్నట్లు సమాచారం. 

దాంతో  రవితేజ కోసం తన పద్దతి మార్చుకున్నాడట విఐ ఆనంద్. పక్కాగా ఇది రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్ గా తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడట. అందుకే టైటిల్ కూడా 'డిస్కో రాజా' అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు రవితేజ తో చేసే డైరక్టర్స్ ఇది పెద్ద పరీక్షే. ఒకప్పుడు రవితేజ అలాంటి వేమీ పట్టించుకునేవారు.

కానీ కాలం కలిసిరాక అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు .  ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ,'నేల టిక్కెట్టు' , 'టచ్ చేసి చూడు' లా ప్లాపులు తప్పకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడంటున్నారు.  మరి ఈ సారి ఎలాంటి రిజల్ట్ ఉండబోతోందో..!

click me!