హీరో విశాల్ కి షాక్ ఇచ్చిన మద్రాస్ హై కోర్ట్

By Satish ReddyFirst Published Sep 22, 2020, 7:28 PM IST
Highlights

హీరో విశాల్ కు మద్రాస్ హై కోర్ట్ షాక్ ఇచ్చింది. ఆయన లేటెస్ట్ మూవీ చక్ర విడుదల ఆపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థ ట్రైడెంట్ పిర్యాదు మేరకు కోర్ట్ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. '

మద్రాస్ హై కోర్ట్ హీరో విశాల్ కి షాక్ ఇచ్చింది. తన లేటెస్ట్ మూవీ చక్ర విడుదల ఆపివేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దర్శకుడు ఎమ్మెస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ చక్ర మూవీ సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కింది. శ్రద్ధ శ్రీనాధ్, రెజీనా కాసాండ్రా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని థియేటర్స్ బంధ్ నేపథ్యంలో దీపావళి కానుకగా ఓ టిటి లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఐతే ఈ చిత్ర విడుదలను ఆపివేయాలని ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ హై కోర్ట్ లో పిటీషన్ వేయడం జరిగింది. విశాల్ తమ బకాయిలు చెల్లించే వరకు చక్ర మూవీ ఓటిటి విడుదల నిలిపివేయాలని కోరడం జరిగింది. ట్రైడెంట్ ఆర్ట్స్ పిటీషన్ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చక్ర మూవీ విడుదల ఆపివేయాలని ఆదేశించడం జరిగింది. 

గత ఏడాది విశాల్ నటించిన యాక్షన్ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మించడం జరిగింది.  నిర్మాతలు 40కోట్లకు పైగా బడ్జెట్ ఈ చిత్రం కొరకు ఖర్చుబెట్టారు. ఐతే యాక్షన్ మూవీ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. మూవీ నిర్మాణం సమయంలో 20కోట్లకు గ్యారంటీగా ఉన్న విశాల్, ఆ నష్టాలు   పూడ్చడానికి ఆ బ్యానర్ లో చక్ర మూవీ చేస్తానని హామీ ఇచ్చారట. దానికి విరుద్ధంగా చక్ర మూవీ తన సొంత బ్యానర్ లో విశాల్ నిర్మించడం జరిగింది. దీనితో తమకు ఆయన చెల్లించ వలసిన 7.7 కోట్ల రూపాయలు చెల్లించే వరకు చక్ర విడుదల ఆపివేయాలని వారు కోరారు.

click me!